SUV sales.. జూన్‌లో బ్రెజా 3 రెట్లు.. సెకండ్ స్లాట్‌లో నెక్సాన్..!!
SUV sales.. జూన్‌లో బ్రెజా 3 రెట్లు.. సెకండ్ స్లాట్‌లో నెక్సాన్..!!| గత నెలలో ఎస్యూవీ కార్ల డిమాండ్ పెరిగింది. మారుతి బ్రెజా మొదటి స్థానంలో ఉండగా ...

న్యూఢిల్లీ: కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతుండగానే కార్ల విక్రయాలు పుంజుకున్నాయి. గత నెలలో కార్ల కొనుగోళ్లలో 22.62 శాతం గ్రోత్ నమోదైంది. వీటిలో లగ్జరీ కార్లు, ఎస్యూవీ మోడల్ కార్లకు డిమాండ్ పెరిగింది. మారుతి మొదలు హ్యుండాయ్, టాటా, మహీంద్రా సంస్థలకు చెందిన ఎస్యూవీ కార్ల కొనుగోళ్లు వ్రుద్ధి చెందాయి.

ఎస్యూవీ కార్లలో బ్రెజా బెస్ట్
కార్ల కొనుగోళ్లలో టాప్-10లో మారుతి వేరియంట్లు నిలుస్తాయి. వాటిల్లో మారుతి బ్రెజా.. టాప్-5 మోడల్ కార్లలో ఒకటిగా నిలిచింది. గతేడాది జూన్‌తో పోలిస్తే గత నెలలో 12,833 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020తో పోలిస్తే 6,805 బ్రెజా మోడల్ కార్ల సేల్స్ ఎక్కువగా నమోదయ్యాయి.
గతేడాది 4,542 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. జూన్ నెల ఎస్యూవీ సెగ్మెంట్ కార్ల సేల్స్‌లో బ్రెజా బెస్ట్‌గా నిలిచింది. నెలవారీ గ్రోత్ 182.54 శాతంగా నిలిచింది. వార్షిక ప్రాతిపదికన బ్రెజా కార్ల విక్రయాలు సుమారు మూడు రెట్లు పెరిగాయి.

ఎస్యూవీ కార్ల కొనుగోలుకే మొగ్గు
గతేడాదితో పోలిస్తే గత నెలలో ఎస్యూవీ మోడల్ కార్ల కొనుగోలుకే యూజర్లు మొగ్గు చూపడం పెరిగింది. టాటా మోటార్స్ వారి టాటా నెక్సన్ రెండున్నర రెట్లు గ్రోత్ నమోదైంది. గతేడాది సెప్టెంబర్‌లో విపణిలో అడుగిడిన కియా సోనెట్ మోడల్ కారు.. గత నెలలో 5,963 యూనిట్లు అమ్ముడైంది.

7 నెలల్లో మాగ్నైట్‌కు ఫుల్ పాపులారిటీ
గతేడాది డిసెంబర్లో దేశీయ మార్కెట్లో నిస్సాన్ ఆవిష్కరించిన మాగ్నైట్ మోడల్ బోలెడు ప్రజాదరణ పొందింది. కంపెనీ ప్రకటించిన స్పెషల్ ఆఫర్తోనూ మాగ్నైట్ బెనిఫిట్ పొందింది. జూన్‌లో 3252 యూనిట్ల మాగ్నైట్ అమ్ముడైంది. ఎస్యూవీ, మిడ్ ఎస్యూవీ సెగ్మెంట్లలో మాగ్నైట్ 9వ స్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి:
ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త చార్జీలు
గుడ్ న్యూస్.. ప్రత్యక్ష పన్ను వసూళ్లు రెట్టింపు.. ఎంతంటే..!:
కార్లపై ఇన్‌ఫుట్ కాస్ట్ దెబ్బ.. మహీంద్రా థార్ ధరెంతంటే?!
ఇంధన డిమాండ్.. జూన్‌లో రికవరీ.. ఎలాగంటే..!!
చౌకగా లాప్‌టాప్‌లు.. రూ.24 వేల లోపు రెడీ.. ఇవీ డిటైల్స్..
బ్యాంకింగ్ అవకతవకలకు చెల్లు.. అందుకు ఆర్బీఐ కంపల్సరీ లీవ్
జనాభా నియంత్రణ తప్పనిసరి: శరద్ పవార్
కరోనా నుంచి కోలుకున్నాడు.. ఎవరెస్ట్‌ను అధిరోహించాడు
మోదీ కేబినెట్లో 90 శాతం మంది కోటీశ్వరులే..
పద్మ అవార్డులకు మీరే నామినేట్ చేయండి.. ప్రజలను కోరిన ప్రధాని మోదీ
దిగివచ్చిన ట్విటర్.. ఫిర్యాదు అధికారిగా వినయ్ ప్రకాశ్ నియామకం
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- brezza
- nexon
- sonet
- suv models
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

