e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home బిజినెస్ స్టూడెంట్‌ బీమా ఉండాల్సిందే

స్టూడెంట్‌ బీమా ఉండాల్సిందే

విదేశీ చదువుల కోసం ఆఫర్‌ చేస్తున్న పాలసీ ప్రీమియంలు ఏడాదికి రూ.9,000 నుంచి రూ.15,000 వరకు ఉన్నాయి. ఈ ప్రీమియంతో లక్ష డాలర్ల వరకు ఆరోగ్య బీమా కవరేజీ ఉంటుంది.

స్టూడెంట్‌ బీమా ఉండాల్సిందే

కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో గతేడాది కాలంగా ఆగిపోయిన విదేశీ యూనివర్సిటీ అడ్మిషన్లు మళ్లీ ప్రారంభ మయ్యాయి. వ్యాక్సినేషన్‌ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఊపందుకోవడంతో విదేశీ ప్రయాణాలూ మొదలయ్యాయి. అడ్మిషన్లు దొరికిన వారందరూ వీసా, ఇతర డాక్యుమెంటేషన్‌ పనులన్నింటినీ పూర్తి చేసుకుంటున్నారు. అయితే కొవిడ్‌-19 కారణంగా మారిన పరిస్థితుల్లో బీమా లేకుండా విదేశీ ప్రయాణం చాలా రిస్కులతో కూడుకున్నది. యూనివర్సిటీలు కూడా వ్యాక్సినేషన్‌తోపాటు ఇన్సూరెన్స్‌ ఉంటేనే అడ్మిషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం మీరు విమానం ఎక్కడానికి ముందే యూనివర్సిటీ కోర్సు ఫీజులో భాగంగా మెడికల్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌పై కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ హెల్త్‌ కవరేజీతోపాటు స్వయం గా మరో ఆరోగ్య బీమా అవసరం.

స్టూడెంట్‌ బీమా ఉండాల్సిందే
- Advertisement -

ముందే తెలుసుకోవాలి
ప్రయాణానికి ముందే ఆరోగ్య బీమా తీసుకోవడం మేలు. అయితే అమెరికాలోని వర్సిటీలు అక్కడి ఇన్సూరెన్స్‌ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. భారతీయ ఇన్సూరెన్స్‌ కవరేజీని అంగీకరించకపోవచ్చు. కానీ ఈ ఏడాది నుంచి సమ్మతించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ముందుగానే అమెరికాలో లేదా మీరు వెళ్లే దేశంలో భారత ఇన్సూరెన్స్‌ పాలసీలను అంగీకరిస్తున్నారా? లేదా? కనుక్కోండి. అలాగే ఆ పాలసీనీ మీరు అడ్మిషన్‌ తీసుకున్న యూనివర్సిటీ అంగీకరిస్తున్నదో లేదో పరిశీలించండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్టూడెంట్‌ బీమా ఉండాల్సిందే
స్టూడెంట్‌ బీమా ఉండాల్సిందే
స్టూడెంట్‌ బీమా ఉండాల్సిందే

ట్రెండింగ్‌

Advertisement