Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు రెండురోజుల వరుస నష్టాల అనంతరం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ కోలుకొని లాభాలబాట పట్టాయి. సెప్టెంబర్‌లో ఫెడ్వడ్డీ రేట్ల తగ్గించనున్నదన్న అంచనాలతో యూఎస్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం క్రితం సెషన్‌తో పోలిస్తే 79,065.22 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో ఒక దశలో 78,895.72 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 79,228.94 పాయింట్లను తాకింది.
చివరకు 149.85 పాయింట్ల స్థిరపడింది. ఇక నిఫ్టీ 4.80 పాయింట్లు పెరిగి.. 24,143.80 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,247 షేర్లు పురోగమించగా.. 2141 షేర్లు పతమయ్యాయి. 91 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్ లాభాల్లో ముగిశాయి. అయితే దివీస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, ఓఎన్టీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి. ఐటీ 1.5శాతం పెరగ్గా.. మిగతా అన్నిరంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, ఆయిల్, గ్యాస్, మెటల్, రియాల్టీ, ఫార్మా, మీడియా 0.5-1 శాతం పతమయ్యాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున తగ్గాయి.
Mark Zuckerberg | భార్య ప్రిస్సిల్లాకు అపూర్వ కానుక ఇచ్చిన మెటా సీఈవో జుకర్‌బర్గ్.. ఫొటోలు వైరల్
బీవోబీ మాన్సూన్ డిపాజిట్ స్కీం