Gig Workers | ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ డెలివరీ సంస్థలు ప్రజలకు విశేష సేవలందిస్తున్నాయి. తమకు కావాల్సిన సరకులు, ఫుడ్ వంటివి వీటి ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికే డెలివరీ చేస్తున్నారు. అయితే, ఆన్లైన్ ఫుడ్, గ్రాసరీ వంటి ఆన్లైన్ డెలివరీ యాప్స్‌లో వర్క్ చేసే వర్కర్లకు ఇప్పటి వరకూ ఎలాంటి ఉద్యోగ భద్రతా లేదు. ఈ క్రమంలో తాజా బడ్జెట్లో కేంద్రం వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
గిగ్ వర్కర్ల (Gig Workers)కు ఆరోగ్య బీమా (health insurence) సౌకర్యంతో పాటు గుర్తింపు కార్డులు (identity cards) ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ స్పీచ్‌లో ఈ మేరకు ప్రకటించారు. ఈ-శ్రమ్ పోర్టల్ కింద గుర్తింపు కార్డులు, పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు వివరించారు. ఈ నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలగనుంది.
Also Read..
Nirmala Sitharaman | గురజాడ సూక్తితో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలమ్మ
Union Budget | వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు.. కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్
Union Budget | బడ్జెట్ వేళ ఊపందుకున్న రైల్వే స్టాక్స్.. లాభాల్లో ట్రేడింగ్