Union Budget : కేంద్రం (Union Government) పార్లమెంటు (Parliament) లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ (Budget) ను ప్రవేశపెడుతున్న వేళ రైల్వే స్టాక్స్ (Railway stocks) ఊపందుకున్నాయి. రైల్వేకు సంబంధించిన అన్ని కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. IRFC (Indian Railway Finance Corporation) లిమిటెడ్, RVNL (Rail Vikas Nigam Limited), IRCON International లిమిటెడ్, RailTel లిమిటెడ్, IRCTC (Indian Railway Catering and Tourism Corporation) తదితర షేర్లు నాలుగు శాతానికి పైగా లాభపడ్డాయి.
జూపిటర్ వాగన్స్ (Jupiter Wagons) షేర్స్ ఏకంగా 19.67 శాతం లాభాలు ఆర్జించాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNl) 12.55 శాతం, టిటాగర్ రైల్ సిస్టమ్ (Titagarh Rail Sistem) లిమిటెడ్ 13.27 శాతం మేర లాభాలు మూటగట్టుకున్నాయి. Texmaco Rail and Engineering కంపెనీ 3.6 శాతం లాభపడింది. పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఎనిమిదోసారి.
Budget 2025 | ఉద్యోగులకు ఊరట కలిగేనా.. ఆదాయపు పన్ను పరిమితి పెంపుపై పదేళ్లుగా వివక్ష!
Union Budget | సీతమ్మ కరుణించేనా? పసుపుబోర్డుకు పైసలిచ్చేనా?
Gas Cylinder Price | బడ్జెట్‌కు ముందు గుడ్‌న్యూస్.. తగ్గిన సిలిండర్ ధర