Stock Market Close | అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పుంజుకున్నాయి. యూఎస్ లేబర్ స్టాటిస్టిక్స్ డేటా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం ఆందోళనలతో మార్కెట్లు ఇటీవల భారీగా పతనమయ్యాయి. మరో వైపు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష అనంతరం రెపోరేటును యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గురువారం ప్రకటించిన అనంతరం మార్కెట్లు నష్టపోయాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కోలుకున్నాయి. అయితే, అమెరికా అమెరికా మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టడంతో మాంద్యం భయాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అలాగే, యూఎస్ లేబర్ మార్కెట్ డేటా అంచనాల కంటే మెరుగ్గా ఉన్నది. దీంతో మార్కెట్లు ఆందోళనలు తొలిగిపోయాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) గురువారం రూ.2,626 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.14శాతం బలపడి రూ.79.27కి చేరుకుంది. ఈ క్రమంలో భారతీయ మార్కెట్లు కొనుగోళ్లతో కళకళలాడంతో మరోసారి భారీగా పెరిగాయి. అన్ని రంగాలలో కొనుగోళ్లు కనిపించాయి. దీంతో బీఎస్ఇలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.4 లక్షల కోట్లు పెరిగి రూ.450.15 లక్షల కోట్లకు చేరుకున్నది. సెన్సెక్స్ దాదాపు 820 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 250 పాయింట్లకుపైగా పెరిగింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 24,386.85 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది.
ఇంట్రాడేలో 79,549.09 పాయింట్ల కనిష్ఠాన్ని తానికి సెన్సెక్స్ అత్యధికంగా.. 79,984.24 పాయింట్లకు చేరింది. చివరకు 819.69 పాయింట్లు పెరిగి.. 79,705.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 250.50 పాయింట్ల లాభంతో 24,367.50 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,049 షేర్లు పురోగమించగా.. మరో 1,305 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో ఐషర్ మోటార్స్, ఓఎన్టీసీ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ భారీ లాభాల్లో ముగిశాయి. బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, పవర్, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా షేర్లు ఒకటి నుంచి 2శాతం మధ్య లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒక శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం వృద్ధిని నమోదు చేశాయి.