సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ ) : వాల్యూ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాప్స్ గోల్డ్ వారి అనుబంధ సంస్థ, 1901లో స్థాపించబడింది. క్యాప్స్ గోల్డ్ గత 70 ఏళ్లుగా బులియన్ వ్యాపారం, రిటైల్ జ్యువెల్లరీ, జ్యువెల్లరీ తయారీ మరియు గోల్డ్ రిఫైనరీ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. వాల్యూ గోల్డ్ సంస్థని సెప్టెంబర్ 2023 హైదరాబాద్లో ప్రారంభించారు. ఎవరైతే వారి ఆర్థిక అవసరాలకు బంగారాన్ని అమ్మి డబ్బు కావాలనుకుంటారో వారి దగ్గర బంగారం కొనే వెసులుబాటుని కల్పిస్తున్నారు.
గోల్డ్లోన్లో ఉన్న బంగారాన్ని కూడా విడిపించి, ఆ రోజు మార్కెట్ రేటుకే కొని గరిష్ట విలువ చేకూరేలా ఆర్థిక భద్రతను కల్పిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో బంజారాహిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్, కూకట్పల్లి మరియు చింతల్లో వారి సేవలను అందిస్తున్నారు. వాల్యూ గోల్డ్, తెలంగాణ రాష్ర్టంలోనే మొట్టమొదటి సారిగా బంగారం కొనుగోలు చేసే వాహనాన్ని వినియోగాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల వారికి బంగారం కొనుగోలు సేవలను అత్యాధిక పారదర్శకత మరియు విలువలతో అందించడం.
త్వరలోనే ఆంధ్రప్రదేశ్లోనూ బంగారం కొనుగోలు చేసే వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొట్టమొదటి సారిగా, బంగారం కొనుగోలు రంగంలో ఆటోమేటిక్ ప్రక్రియను ప్రవేశపెట్టారు. వ్యక్తుల ప్రమేయమే లేకుండా బరువు మరియు స్వచ్ఛతను, ఘనించి బంగారాన్ని కరిగించి వినియోగదారులకు అత్యధిక మొత్తం చేకూరేలా సేవలను అందిస్తున్నారు. బంగారం మరియు వెండి నాణేలను వారి బ్రాంచీలలో కొనుగోలు చేయవచ్చు. ఎన్ఏబీఎల్ సర్టిఫైడ్ అయిన క్యాప్స్ గోల్డ్ రిఫైనరీ ఈ నాణేలు తయారు చేస్తున్నారు.
వినియోగదారులు, వారి బంగారం యొక్క స్వచ్ఛతని తెలుసుకోవడానికి ఫ్రీ ప్యూరిటీ టెస్ట్ సేవలను వారి బ్రాంచీల్లో ఉపయోగించుకోవచ్చు. మన ఆర్థిక అవసరాలకు బంగారాన్ని అమ్ముకోవడం కూడా అత్యంత తెలివైన అడుగు, బంగారాన్ని అమ్మి డబ్బుని ఇంటికి తీసుకొని రావటం కూడా శ్రావణమే.