ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Dec 23, 2020 , 02:03:38

కోలుకున్న సూచీలు

కోలుకున్న సూచీలు

  • సెన్సెక్స్‌ 453, నిఫ్టీ 138 పాయింట్ల లాభం

ముంబై: కొత్త రకం కరోనా వైరస్‌ రావడంతో సోమవారం భారీగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఊతమివ్వడానికి అమెరికా ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం లభించడంతో మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ మంగళవారం 452.73 పాయింట్లు లాభపడి మళ్లీ 46 వేల మార్క్‌ దాటి 46,006.69 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 137.90 పాయింట్లు అందుకొని 13,466.30 వద్ద స్థిరపడింది. 

ఐటీ రంగ షేర్ల జోరు

ఐటీ రంగ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరులు ఎగబడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు వెల్లడవడం ఇందుకు కారణం. దీంతో ఈ రంగ సూచీలు మూడు శాతం వరకు లాభపడ్డాయి. 


VIDEOS

logo