MLA Raja Singh | హిందూ జనాభా తగ్గితే దేశం ముక్కలు.. మోదీ గెలిస్తే మత ఆధారిత జనాభా నియంత్రణ చట్టం: : ఎమ్మెల్యే రాజాసింగ్
దేశంలో హిందూ జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే విషయమని, హిందూ జనాభా తగ్గితే దేశం మత ప్రాతిపదికన ముక్కలయ్యే ప్రమాదం ఉన్నదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. మోదీ సర్కారును మూడోసారి గెలిపించుకుంటే మత ఆధారిత జనాభా నియంత్రణ కోసం కొత్త చట్టం వస్తుందని తెలిపారు.
MLA Raja Singh | సూర్యాపేట, మే 9 (నమస్తేతెలంగాణ) : దేశంలో హిందూ జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే విషయమని, హిందూ జనాభా తగ్గితే దేశం మత ప్రాతిపదికన ముక్కలయ్యే ప్రమాదం ఉన్నదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. మోదీ సర్కారును మూడోసారి గెలిపించుకుంటే మత ఆధారిత జనాభా నియంత్రణ కోసం కొత్త చట్టం వస్తుందని తెలిపారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గంలో బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 1950 నుంచి 2015 వరకు మత ఆధారిత జనాభా పెరుగుదలపై ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చేసిన పరిశోధన అంశాలను ప్రస్తావించారు. భారత్లో హిందూ జనాభా 7.3 శాతం తగ్గిందని, ముస్లిం మైనార్టీ జనాభా 43 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఈ రకంగా హిందూ జనాభా తగ్గుతూ పోతే ఇండియా ఇస్లామిక్ దేశంగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఇది దేశానికి మంచి సంకేతం కాదని అన్నారు. అక్బర్, అసదుద్దీన్ ఒవైసీలు ఎన్నికల సమయంలో విద్వేష ప్రకటనలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఈయన వెంట ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి, బీజేపీ ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

