Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాల్లోనే ముగిశాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయింది. జూలై రిటైల్ ద్రవోల్బణం 3.54శాతానికి పడిపోయింది. 2019 సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి దిగువన ఉండగా.. జూలై రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేండ్ల కనిష్ఠ స్థాయికి చేరుకున్నది. మరో వైపు సెబీ చైర్మన్, అదానీ గ్రూప్‌పై ప్రముఖ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణల పర్వం కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో మార్కెట్లు అస్థితరకు గురయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మూడుశాతం.. ఎస్బీఐ, టాటా స్టీల్ షేర్లు 2 శాతం చొప్పున పడిపోయాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 79,552.51 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలై.. ఏ దశలోనూ కోలుకోలేదు.
చివరి వరకు మరిన్ని నష్టాలు పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 78,889.38 పాయింట్లు నష్టపోగా.. అత్యధికంగా 79,692.55 పాయింట్లకు చేరింది. చివరకు 692.89 పాయింట్లు పతనమై.. 78,956.03 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 208 పాయింట్లు నష్టపోయి 24,139.00 వద్దకు స్థిరపడింది. నిఫ్టీలో టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్, హెచ్‌సీఎల్ టెక్ లాభపడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. బ్యాంక్, పవర్, ఆయిల్, గ్యాస్, మెటల్, మీడియా, టెలికాం ఒక్కో శాతం పతనం కాగా.. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కోశాతం పతనమయ్యాయి.
GST Council meeting | 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారు
Bharti Global | 33,500 కోట్ల డీల్.. బీటీ గ్రూప్‌లో భారతీ గ్లోబల్‌కు 24.5 శాతం వాటా