Bharti Global | న్యూఢిల్లీ, ఆగస్టు 12: బ్రిటన్‌కు చెందిన బహుళజాతి టెలికం సంస్థ బీటీ గ్రూప్‌లో సునీల్ భారతీ మిట్టల్‌కు చెందిన భారతీ గ్లోబల్‌కు 24.5 శాతం వాటా దక్కుతున్నది. డీల్ విలువ దాదాపు రూ.33,500 కోట్లు (4 బిలియన్ డాలర్లు).
కాగా, బీటీ గ్రూప్‌లోని ఆల్టీస్ నుంచి 9.99 శాతం వాటాను వెంటనే కొనేస్తున్న భారతీ.. మిగతా వాటాను రెగ్యులేటరీ అనుమతులు వచ్చాక సొంతం చేసుకోనున్నది. అధిక రుణ భారం నేపథ్యంలోనే ఈ వాటాను ఆల్టీస్ అమ్ముకుంటున్నది. ఇదిలావుంటే టాటా, మహీంద్రా, వెల్స్పన్ తర్వాత బ్రిటీష్ సంస్థల్లో వాటాలను పొందిన భారతీయ సంస్థగా భారతీ ఎంటర్ప్రైజెస్ నిలిచింది.
డిపాజిట్ వాపస్
ముంబై, ఆగస్టు 12: డిపాజిట్ చేసిన 3 నెలల్లోగా అత్యవసర పరిస్థితి అంటూ డిపాజిటర్లు వస్తే ఆ మొత్తాన్నీ వెనక్కి ఇచ్చేయాల్సిందేనని ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ సోమవారం స్పష్టం చేసింది. అయితే వడ్డీ చెల్లింపులుండవు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానున్నది.
పీఎన్బీ బ్రెయిలీ కార్డ్
పీఎన్బీ.. అంతః దృష్టి బ్రెయిలీ డెబిట్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. చూపులేని వారికోసం దీన్ని పరిచయం చేసింది. రూపే నెట్‌వర్క్‌పై ఇది లభిస్తుంది.