Samsung Galaxy S25 | దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం సామ్సంగ్.. తమ పాపులర్ బ్రాండ్ గెలాక్సీ సిరీస్‌లో ఎస్25 (Samsung Galaxy S25) మోడళ్లను ఆవిష్కరించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో బుధవారం రాత్రి వీటిని మార్కెట్లోకి లాంఛ్ చేసింది. ఎస్25, ఎస్25 ప్లస్, ఎస్25 అల్ట్రా పేరిట ఈ ఫోన్లను పరిచయం చేసింది. మరిన్ని ఆధునిక ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త సిరీస్ ఫోన్ల ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్25, ఎస్ 25+ ఫోన్ల ధర, ఇతర వివరాలు..
సామ్సంగ్ గెలాక్సీ ఎస్25, ఎస్ 25+ ఫోన్లు 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్, 12జీబీ+512జీబీ వేరియెంట్లలో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్లు ఐస్‌బ్లూ, మింట్, సిల్వర్ షాడో కలర్స్‌లో లభించనున్నాయి. ఎస్ 25లో 6.2 అంగుళాల ఫుల్హెచ్డీ డైనమిక్ అమోలోడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఇక ఎస్ 25+లో 6.7 అంగుళాల డిస్ప్లే ఇచ్చారు. ఈ రెండు ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7పై పనిచేస్తాయి.
50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 10 ఎంపీ టెలిఫొటో కెమెరాలు ఉంటాయి. సెల్ఫీల కోసం 12 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇక ఎస్ 25 ఫోన్లో 25 వాట్స్‌కి సపోర్ట్ చేసే 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. అదేవిధంగా ఎస్ 25+లో 45 వాట్స్కు సపోర్ట్ చేసే 4,900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ రెండు ఫోన్లు వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఏడేళ్ల వరకూ సెక్యూరిటీ అప్డేట్లు ఇచ్చారు. ధర విషయానికొస్తే.. భారత్‌లో ఎస్ 25 ఫోన్ల ప్రారంభ ధర రూ.80,999గా ఉంది. ఎస్ 25+ బేసిక్ మోడల్ ధర రూ.99,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ ఫోన్లు ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఎస్ 25 అల్ట్రా ఫోన్ల ధర, ఇతర వివరాలు..
ఎస్ 25 అల్ట్రా (Samsung Galaxy S25 Ultra) మూడు వేరియంట్లలో లభించనుంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 51జీబీ స్టోరేజ్, 12Gజీబీ ర్యామ్ + 1టీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్ల ధరలు రూ.1,29,999 నుంచి ప్రారంభమవుతాయి. టైటానియం బ్లాక్, గ్రే, సిల్వర్‌బ్లూ, వైట్ బ్లూ రంగుల్లో లభిస్తాయి.
6.9 ఇంచెస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 2,600 నిట్స్ బ్రైట్నెస్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటు ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, అండ్రాయిడ్ 15 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 7తో ఇది పని చేస్తుంది. దీనికి కూడా 7 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్లు ఇవ్వనున్నారు. ఇందులో 45 వాట్స్‌కి సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో అధునాతనమైన కెమెరా ఫీచర్లు ఉన్నాయి. మొత్తం వెనక వైపు 4 కెమెరాలు ఇచ్చారు. 200 ఎమ్పీ ప్రైమరీ కెమెరా, 50 ఎమ్పీ అల్ట్రా వైడ్ కెమెరా, 50 ఎమ్పీ టెలీ ఫొటో కెమెరా, 10 ఎమ్పీ టెలిఫొటో కెమెరా అమర్చారు. సెల్ఫీ కోసం 12 ఎంపీ కెమెరా ఉంటుంది.
Also Read..
Budget 2025 | ఆదాయ పన్ను తగ్గాలి.. బడ్జెట్లో మెజారిటీ ట్యాక్స్‌పేయర్స్ కోరేదిదే
Airtel | వినియోగదారులకు ఎయిర్టెల్ షాక్.. ఆ ప్లాన్లపై డాటా ఎత్తివేత