Budget 2025 | న్యూఢిల్లీ, జనవరి 22: రాబోయే బడ్జెట్లో ఆదాయ పన్ను (ఐటీ) రేట్లు తగ్గాలనే అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నట్టు బుధవారం గ్రాంట్ థోంటన్ భారత్ ప్రీ-బడ్జెట్ సర్వే తెలిపింది. 57 శాతం మందిది ఇదే మాట అని స్పష్టం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ క్రమంలో తాజా సర్వే ఫలితాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
ప్రోత్సాహకాలు పెరగాలి
ప్రస్తుతం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల్లో 72 శాతం మంది కొత్త ఆదాయ పన్ను విధానాన్నే ఎంచుకుంటున్నారు. అయినప్పటికీ 63 శాతం మంది పాత ఆదాయ పన్ను విధానం కిందనున్న ప్రోత్సాహకాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడుతున్నట్టు సర్వే పేర్కొన్నది. ఇక కొత్త పన్ను విధానంలోనూ పన్ను రేట్లు తగ్గాలని దాదాపు 46 శాతం మంది డిమాండ్ చేస్తుండగా, ఈసారి పన్ను మినహాయింపు పరిమితుల్ని పెంచుతారన్న విశ్వాసాన్ని 26 శాతం మంది వ్యక్తం చేశారు. ఈ సర్వేలో 500 మందికిపైగా పాల్గొనగా, వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గి, వ్యక్తుల ఆదా యం పెరిగేలా రాబో యే బడ్జెట్ నిర్ణయాలుండాలని అంతా కోరుకుంటున్నట్టు గ్రాంట్ థోంటన్ వెల్లడించింది.
సర్వేలో డిమాండ్లు