BSNL New Plan | ప్రభుత్వరంగ టెలికం దిగ్గజం టెలికాం సర్వీస్ ప్రొవైడర్ పోటీ కంపెనీలకు షాక్ ఇస్తున్నది. కంపెనీ మరో సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ జాబితాలో లాంగ్ వాలిడిటీ ప్లాన్‌ను ప్రకటించింది. తక్కువ ధరకు తీసుకువచ్చిన ఈ ప్లాన్ ఏడాది చెల్లుబాటవుతుంది. ఈ ప్లాన్‌తో తరుచుగా రీచార్జ్ చేసుకునే తిప్పలు తప్పనున్నాయి. ఇటీవల బీఎస్ఎన్ఎల్ 425 రోజుల రీచార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇప్పుడు యూజర్లకు అలాంటి కొత్త ప్లాన్‌నే తీసుకురాగా.. పోటీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కంపెనీల్లో టెన్షన్‌ను పెంచుతున్నది. బీఎన్‌ఎస్‌ఎల్ కొత్తగా 365 రోజుల వాలిడిటీ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఇందులో యూజర్లకు రూ.1999తో రీచార్జ్ చేసుకుంటే మొత్తం 600 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు వస్తాయి. అలాగే, అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది.
యూజర్లు ఎక్కువగా ఎలాంటి పరిమితి లేకుండా డేటా, కాలింగ్‌ను ఆస్వాదించాలని కోరుకుంటారు. ఈ క్రమంలో ఇది యూజర్లకు ఫీచర్ రిచ్ ప్యాకేజీని అందిస్తున్నది. స్మార్ట్‌ఫోన్స్ ఎక్కువగా వాడే వారికి ఇది అత్యుత్తమ ప్లాన్ అని బీఎస్ఎన్ఎల్ పేర్కొంటుంది. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 365 రోజులు చెల్లుబాటవుతుందని.. పదే పదే రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండదని చెబుతున్నది. ఈ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్ సౌకర్యం ఉంటుంది. ఇక రోజూ వంద ఎస్ఎంఎస్లు పంపేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్‌లో హైలెట్ 600 జీబీ డేటా. ప్రతి రోజు 1.5 జీబీ కంటే ఎక్కువగా డేటా అందుతుంది. అలాగే, కాలర్ టూన్స్ సహా వాస్ సేవలు సైతం పొందవచ్చు. ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కంపెనీల ప్లాన్లతో పోలిస్తే.. ఈ ప్లాన్ చౌకగా ఉంటుందని టెలికాం దిగ్గజం పేర్కొంటుంది.
Budget 2025 | ఆదాయ పన్ను తగ్గాలి.. బడ్జెట్లో మెజారిటీ ట్యాక్స్‌పేయర్స్ కోరేదిదే
Air Passengers | జోరుగా ఎయిర్ ట్రాఫిక్.. 6 శాతం పెరిగిన దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ