e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home News రూ.14 వేల కోట్ల ప్ర‌భుత్వ సెక్యూరిటీల వేలం ర‌ద్దు

రూ.14 వేల కోట్ల ప్ర‌భుత్వ సెక్యూరిటీల వేలం ర‌ద్దు

రూ.14 వేల కోట్ల ప్ర‌భుత్వ సెక్యూరిటీల వేలం ర‌ద్దు

న్యూఢిల్లీ: రూ.14 వేల కోట్ల విలువైన ప్ర‌భుత్వ సెక్యూరిటీల (జీ-సెక్స్‌) వేలం ప్ర‌క్రియ ర‌ద్దు వేసిన‌ట్లు భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తెలిపింది. ప‌దేండ్ల గ‌డువు గ‌ల ప్ర‌భుత్వ బాండ్‌ల‌ను అధిక ధ‌ర‌ల‌కు అమ్మాల‌ని ట్రేడ‌ర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌కు అధిక మొత్తంలో చెల్లించ‌డానికి సిద్ధంగా లేదు ఆర్బీఐ. అందుకే వాటి వేలాన్ని ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపింది.

ఆర్బీఐ డేటా ప్ర‌కారం రూ.5,100 కోట్ల విలువైన ప్ర‌భుత్వ బాండ్లు 2022లో మెచ్యూర్ అవుతాయి. వాటిని తొలుత సోమ‌వారం విక్ర‌యించాల‌ని ఆర్బీఐ భావించింది. ఇంత‌కుముందు రూ.3000 కోట్ల విలువైన బాండ్ల‌ను విక్ర‌యించింది సెంట్ర‌ల్ బ్యాంక్‌.

ఇంత‌కుముందు రూ.9000 కోట్ల విలువైన బాండ్ల విక్ర‌యించిన‌ట్లే.. 2061లో మెచ్యూర్ కానున్న రూ.6,237 కోట్ల విలువైన బాండ్ల‌ను విక్ర‌యించాల‌ని ఆర్బీఐ భావించింది. 2030లో మెచ్యూర్ కానున్న రూ.14 వేల కోట్ల బాండ్ల విక్ర‌యాన్ని ర‌ద్దు చేసింది.

2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో తొలి వేలంలో రూ.11 వేల విలువైన ప్ర‌భుత్వ సెక్యూరిటీల వేలాన్ని నిలిపేసింది. ఈ సెక్యూరిటీలు 2026లో మెచ్యూర్ అవుతాయి.

ఇవి కూడా చదవండి..

స్మార్ట్‌గా దోపిడీ.. రూ.5 లక్షలు చోరీ

బ్యాంక్ అల‌ర్ట్ : ఆదివారం ఆర్టీజీఎస్ సేవ‌ల‌కు బ్రేక్!

ఐటీ ఉద్యోగాల జాతర

ఈనెల 30 వ‌ర‌కు గురుకుల‌సెట్‌ దర‌ఖాస్తులు

నీట్‌-2021వాయిదా

దేశంలోకి త్వరలో కొత్తగా 8 బ్యాంకులు

చౌక వ‌డ్డీకే బంగారం లోన్‌.. ఈ బ్యాంకుల్లోనే..!

వాట్సాప్‌ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు

ఫుడ్ అగ్రిగేట‌ర్ స్విగ్గీ విలువ ఎంతంటే!

Advertisement
రూ.14 వేల కోట్ల ప్ర‌భుత్వ సెక్యూరిటీల వేలం ర‌ద్దు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement