Personal Finance | గోల్డ్ కొనడం ఉత్తమమా? మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదా?
Personal Finance | ఆర్థికాంశాల్లో ఆచితూచి అడుగేయడం ముఖ్యం. అలాగని మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా కరిగిపోతుంది. అందుకే పెట్టుబడుల విషయంలో తొందరపాటు పనికిరాదు. అలాగని ఆలస్యమూ కూడదు. ‘మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?’ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు.
Personal Finance | ఆర్థికాంశాల్లో ఆచితూచి అడుగేయడం ముఖ్యం. అలాగని మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా కరిగిపోతుంది. అందుకే పెట్టుబడుల విషయంలో తొందరపాటు పనికిరాదు. అలాగని ఆలస్యమూ కూడదు. ‘మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?’ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ, ‘ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి’ అంటే మాత్రం సవివరంగా విశ్లేషించరు. ఒకరు రియల్ఎస్టేట్లో పెట్టమని సలహా ఇస్తారు. మరొకరు షేర్స్ కొనమని చెబుతారు. ఇంకొకరు మ్యూచువల్ ఫండ్స్ ద బెస్ట్ అంటారు. బంగారం ఉత్తమం అని మరికొందరి ఉవాచ. అన్ని రంగాల్లోనూ ఆగమేఘాల మీద ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు.. మ్యూచువల్ఫండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏదో కాని పని అన్నట్టుగా కంగారుపడుతుంటారు. షరతులకు లోబడి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అత్యవసర సమయాల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
నిర్దుష్టమైన ఫలితాన్ని ఆశించే ఏ పని అయినా మొదలుపెడతాం. పెట్టుబడి విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఫలితం ముందస్తుగా ఊహించి, కాలపరిమితిని దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మదుపు చేయడం చాలా అవసరం. భూమి కొన్నా, మరేదైనా ఆస్తి కొనుగోలు చేసినా ఏ ప్రయోజనం ఆశించి కొంటున్నామన్నది ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలమైన వేదికే! కానీ, మార్కెట్ హెచ్చుతగ్గులు లాభాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయనే ఉద్దేశంతో చాలామంది ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి వెనుకంజ వేస్తుంటారు.
అన్నిట్లో అదే రిస్క్
మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ అనే భావన చాలామందిలో ఉంటుంది. నెలవారీగా కొంత మొత్తాన్ని ఎఫ్డీ చేసుకుంటే తప్ప.. మరే పెట్టుబడి అయినా ఎంతోకొంత రిస్క్‌తో కూడుకున్నదే. ఉదాహరణకు రూ.పది లక్షలు పెట్టి ఓ ప్లాట్ తీసుకున్నారు. పదేండ్లకు దాని విలువ మార్కెట్లో రూ.20 లక్షలకు పెరిగింది! అయితే అత్యవసరం వచ్చిందే అనుకుందాం! అప్పటికప్పుడు మార్కెట్లో అమ్మకానికి పెడితే రూ.20 లక్షలు వస్తుందన్న గ్యారెంటీ లేదు! పైగా సరైన బయ్యర్ దొరికి ఆ ప్లాట్ అమ్ముడుపోవడానికి కనీసం రెండు నెలల సమయమైనా పట్టొచ్చు. ఈలోపు మీ అవసరం మాటేమిటి? అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి. ఎస్ఐపీ ద్వారా నెలకు రూ.50వేలు ఇన్వెస్ట్ చేశారే అనుకుందాం. అంటే సంవత్సరానికి రూ.6 లక్షలు. పదేండ్లకు రూ.60 లక్షలు అవుతుంది. రిటర్స్న్తో కలుపుకొంటే రూ.కోటి వరకూ వస్తుంది. మార్కెట్ ఒడుదొడుకులకు గురైనా రూ.80 లక్షల వరకూ రావొచ్చు. కరోనా వంటి దుర్భరమైన పరిస్థితులు ఏర్పడితే మ్యూచువల్ ఫండ్స్ రిటర్స్న్ మాత్రమే కాదు.. కోట్లు వెచ్చించి భూములు కొనే వ్యక్తులూ ఉండరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉద్యోగం పోయినా.. మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే డబ్బులు వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వారం రోజుల్లో నగదు మీ ఖాతాలో జమవుతుంది. ఇల్లు గడవడానికి ఆ సొమ్ము ఉపయోగపడుతుంది.

Investments2
ఉన్నదంతా వద్దు..
అలాగని ఉన్నదంతా మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతామంటే పొరపాటు. మీ ఆదాయంలో కొంత మొత్తం వాటికి కేటాయించాలి. ఎంత అనేది మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు మూడేండ్ల కూతురు ఉంటే.. తను ఇంటర్ పూర్తయ్యేసరికి సుమారు పదిహేనేండ్ల సమయం ఉంటుంది. ఈ కాలపరిమితితో పై చదువు కోసం రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు వచ్చే ప్లాన్ ఎంచుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే పెండ్లికే అనుకోండి మరో ఐదేండ్లు కాలపరమితి పెంచుకోవచ్చు. పిల్లల చదువు, ఇంటి ఖర్చులు, ఇతరత్రా అన్నీ పోయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఎస్ఐపీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే.. సమయోచితంగా వాడుకునే వెసులుబాటు ఉంటుంది. మీ అవసరాలకు తగ్గట్టుగా షరతులకు లోబడి ఇన్వెస్ట్ చేస్తే.. ఆశించిన రాబడి తప్పకుండా లభిస్తుంది!
బంగారం బంగారమే!
మ్యూచువల్ ఫండ్స్ కాలపరిమితి ఎంత ఉండాలన్నది ముఖ్యం. మీ అవసరం కనీసం ఎనిమిదేండ్ల కాలపరిమితి తర్వాత అయితే మ్యూచువల్ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ మంచి ఎంపిక. నాలుగేండ్ల లోపే అయితే ఈక్విటీ షేర్లు మంచిది. దీర్ఘకాలిక ప్రయోజనాలకు రియల్ ఎస్టేట్ మంచి ఎంపిక. అయితే, మీ అవసరాన్ని ముందుగానే అంచనావేసి అందుకు తగ్గట్టుగా అది మంచి ధర పలికినప్పుడు అమ్మాల్సి ఉంటుంది. బంగారం మీద పెట్టుబడి కాలానికి సంబంధం లేని ఇన్వెస్ట్మెంట్. బంగారం ధరలు కాస్త హెచ్చుతగ్గులకు లోనైనా పెట్టుబడికి గిట్టుబాటు అవుతుంది. పైగా బంగారం అయితే అమ్మకుండానే అవసరాలు తీర్చుకోవచ్చు. బ్యాంకులో కుదువపెడితే అప్పటికప్పడు అప్పు పుడుతుంది. మరీ తప్పని పరిస్థితుల్లో అమ్ముకున్నా మార్కెట్ ధర పలుకుతుంది.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Read More :
Home Loan | హోంలోన్ తీసుకున్న వారికి అలర్ట్.. వడ్డీరేటు పెరిగినప్పుడు ఈ చిన్న టిప్స్ పాటించండి
“Commercial Property | ఇల్లు కొంటే మంచిదా? కమర్షియల్ ప్రాపర్టీ కొంటే లాభమా?”
Bank Auction Property | తక్కువలో వస్తుందని వేలంలో ఇల్లు కొంటున్నారా? ఈ నష్టాల గురించీ ఆలోచించండి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

