ఆదివారం 29 మార్చి 2020
Business - Jan 28, 2020 , 00:00:43

ఒప్పోతో ఐఐటీ హైదరాబాద్‌ టైఅప్‌

ఒప్పోతో ఐఐటీ హైదరాబాద్‌ టైఅప్‌

కంది: ఒప్పోతో ఐఐటీ హైదరాబాద్‌ ఒప్పందం కుదుర్చుకున్నది. సోమవారం ఇందుకు సంబంధించి వివరాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఐఐటీలోని రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుమోహన మాట్లాడుతూ అడ్వాన్స్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీ అభివృద్ధిపై సంయుక్తంగా పరిశోధనలు జరుపుతామని తెలిపారు. వీటితోపాటు కెమెరా అండ్‌ ఇమేజ్‌ ప్రాసెస్‌ని, బ్యాటరీ, 5జీ నెట్‌వర్క్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంశాలపై పరిశోధనలు జరుపబోతున్నట్లు వివరించారు. 

logo