Opec+ on Crude | 66 డాలర్లకు బ్యారెల్ క్రూడ్.. ఒమిక్రాన్ ఎఫెక్టేనా? ఒపెక్ ఇలా..!
Opec+ on Crude | బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 69 డాలర్లు. ఒపెక్ ప్లస్ జనవరి నుంచి రోజూ 4 లక్షల బ్యారెళ్లు ఉత్పత్తి చేయనున్నది.

Opec+ on Crude | కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం.. ధరలు తగ్గించడానికి ముడి చమురు రిజర్వు నిల్వలను విపణిలోకి విడుదల చేయాలని అమెరికా, భారత్, చైనా, జపాన్ తదితర దేశాలు తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 69.67 డాలర్లకు చేరింది. గత పది రోజులుగా హైదరాబాద్లో రిటైల్ బంకుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20గా కొనసాగుతూనే ఉన్నది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ ధర 66.50 డాలర్ల వద్ద స్థిరపడింది.
ఒకవైపు కోవిడ్ న్యూవేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నా.. సౌదీ అరేబియా సారధ్యంలోని ఒపెక్ ప్లస్ కూటమి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రతి రోజూ 4 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి చేయాలన్న ప్రణాళికకే కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఇంతకుముందే తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఒపెక్ ప్లస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, పరిస్థితులను బట్టి తక్షణ సర్దుబాట్లు కూడా ఉంటాయని పేర్కొంది.
అమెరికాతోపాటు దాని మిత్ర దేశాలు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్లు తమ దేశాల్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించడానికి తమ వద్దనున్న రిజర్వు ముడి చమురు నిల్వలు విపణిలోకి విడుదల చేయాలని నిర్ణయించారు. అమెరికా 50 మిలియన్ల బ్యారెళ్లు విడుదల చేయనున్నది. తదుపరి 32 మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు విడుదల చేయాలని నిర్ణయించింది
అమెరికా. దీనికి తోడు కొంత కాలంగా ఆయిల్ మార్కెట్లోకి ఇరాన్ రీ ఎంట్రీఇస్తుందన్న వార్తల నేపథ్యంలో గురువారం ఒపెక్ ప్లస్ కూటమి తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకున్నది. గత పది రోజులుగా బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 10 డాలర్లు తగ్గుముఖం పట్టడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్లో బడ్జెట్ ధరలో టేస్టీ దోశ, ఇడ్లీ తినాలంటే.. అక్కడికి వెళ్లాల్సిందే
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం అదే.. పారిస్ కూడా దాని తర్వాతే!
మట్టితో ఇంటిని నిర్మించాడు.. ఆ ఇల్లు స్పెషాలిటీ ఏంటో తెలుసా?
డ్రైవర్లకు పోలీసుల ‘గరమ్ చాయ్’.. ఎందుకంటే?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

