Equity Mutual Funds | నిరంతర ఆదాయం సంపాదించడంతోపాటు రిటైర్మెంట్ తర్వాత కుటుంబ జీవనానికి సరిపడా మనీ సంపాదించడమే ఉద్యోగం లక్ష్యం. మీ రిటైర్మెంట్ జీవితం గురించి తీవ్రంగా ఆలోచించి గణనీయమైన కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తే రిస్క్ ఫ్రీ రిటర్న్స్ గల స్కీమ్స్‌లో నిరంతరం మదుపు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న రోజుల్లో మీరు కోటీశ్వరులైనా ఆరేడేండ్లకు మించి నిల్వలు ఉండవు. కనుక రిటైర్మెంట్ తర్వాత హాయిగా జీవనం సాగించడానికి నిరంతరం కొంత సొమ్ము పొదుపు చేయడం చాలా ముఖ్యం.
దీనికి ముందుగా కఠినమైన క్రమశిక్షణ పాటించగలగాలి. ఫిక్స్డ్ డిపాజిట్లలో కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్లపై దృష్టి కేంద్రీకరించాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో 12 శాతం రిటర్న్స్ ఇస్తాయి. వేతన జీవులైనా, బిజినెస్ క్లాస్ అయినా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమపద్దతితో కూడిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అమలు చేస్తే మెరుగైన రిటర్న్స్ లభిస్తాయి. బుల్, బేర్ మధ్య తచ్చాడే స్టాక్ మార్కెట్ల కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్, అనిశ్చితి ప్రభావం తక్కువ.
30 ఏండ్ల వయస్సులోనే మంచి ఉద్యోగం వస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సిప్‌లో రోజుకు రూ.300 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళితే 21 ఏండ్ల తర్వాత సుమారు రూ.కోటి రిటర్న్స్ వస్తాయి. రోజుకు రూ.250 ఇన్వెస్ట్ చేసినా నెలకు రూ.7,500 చొప్పున 12 శాతం రిటర్న్స్‌తో 21 ఏండ్లకు రూ.కోటి వస్తుంది. అలా కానీ పక్షంలో ప్రతియేటా మీ ఇన్వెస్ట్మెంట్ సిప్ 15 శాతం పెంచుతూ పోతే ఈ స్కీమ్ టైం 15 ఏండ్లకే పరిమితం చేయొచ్చు. 16వ ఏట రూ.కోటి సంపాదించొచ్చు. ఉదాహరణకు ఈ ఏడాది రూ.7500 ఇన్వెస్ట్ చేస్తే, 2022లో 7500+15 % చెల్లించాలి.
మీరు 30 ఏండ్ల వయస్సులోనే ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే 46 ఏండ్లకే రూ.కోటి మీవద్ద సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత 14 ఏండ్లు కూడా ఇదే స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మీ కార్పస్ ఫండ్ మరింత పెరుగుతుంది. రిస్క్ ఫ్రీ స్కీమ్స్ గల పెట్టుబడి మార్గాలు మార్కెట్లో పుష్కలంగా ఉన్నాయి. బ్లూచిప్ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ తదితర స్కీమ్స్ ఉన్నాయి. కనుక మీరు పెట్టుబడులు మదుపు చేయాలని నిర్ణయించుకునే ముందు మీరు ఆయా స్కీమ్స్‌పై పరిశోధన జరుపాలని నిపుణులు సూచిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
jagadguru adi shankaracharya | ఆదిశంకరుడికి జీవంపోసిన అరుణ్ యోగిరాజ్
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
లక్ష్మీదేవి 8 రూపాల వెనుక ఆంతర్యమిది.. దీన్ని అర్థం చేసుకుంటే సిరిసంపదలకు కొదవ ఉండదు
తులసీదాసు భరోసా హనుమాన్ చాలీసా