Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లో మిశ్రమ సంకేతాలతో పాటు వడ్డీ రేట్లపై యూఎస్ రిజర్వ్ యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ఉదయం లాభాలతో మొదలైన మార్కెట్లు పొద్దంతా లాభాల్లోనే కొనసాగాయి. మూడో సెషన్లో సూచీలు స్వల్పంగా పతనం కాగా.. చివరి అరగంటలో మళ్లీ కోలుకొని లాభాల్లో ముగిశాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 76,598.84 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 76,401.13 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 76,962.88 పాయింట్లు వరకు చేరింది. చివరకు 226.85 పెరిగి.. 76,759.81 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 86.40 పాయింట్లు పెరిగి 23,249.50 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,051 షేర్లు లాభాను నమోదు చేశాయి.
మరో 1,734 షేర్లు నష్టపోగా.. 117 షేర్లు మారలేదు. నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్టెల్, సిప్లా, పవర్ గ్రిడ్ కార్ప్ లాభాలను ఆర్జించాయి. టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆటో, ఐటీ, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.4-2 శాతం మధ్య పతనం కాగా.. చమురు, గ్యాస్, పవర్, ఫార్మా, పీఎస్‌యూ, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ 0.5శాతం నుంచి ఒకశాతం వరకు మధ్య పెరిగాయి. ఎన్ఎస్ఈలో ఫార్మాస్యూటికల్ దిగ్గజం సిప్లా మూడుశాతం లాభపడగా.. పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా రెండూ 2.76 శాతం వృద్ధి చెందాయి. బజాజ్ ఫైనాన్స్ 2.67 శాతం లాభపడింది. చమురు దిగ్గజం ఓఎన్జీసీ 2.45శాతం పెరిగింది.
Electric Vehicles | ఈవీలదే భవిష్యత్తు.. ఎలక్ట్రిక్ వెహికిల్సే కొంటామంటున్న 64 శాతం మంది!