IRCTC | ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఫుల్‌జోష్‌లో ఉంది. రెండు స్క్రిప్ట్‌లు రాకెట్ వేగంతో దూసుకెళ్లుతున్నాయి. ఇప్పటికీ ఈ రెండు స్టాక్స్ ట్రెమండస్ మూమెంటమ్‌తో పరుగులు తీస్తున్నాయి. భారతీయ రైల్వేల క్యాటరింగ్ కం టికెట్ బుకింగ్ సంస్థ ఐఆర్సీటీసీ షేర్ మంగళవారం 8 శాతం పెరిగి రూ.6,375లకు దూసుకెళ్లింది. దీంతో ఐఆర్సీటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.01 లక్షల కోట్లకు చేరుకున్నది. భారత్‌లో రూ. లక్ష కోట్లు దాటిన కంపెనీల్లో ఐఆర్సీటీసీ 52వది.
ఐఆర్సీటీసీలో ఏడాది క్రితం రూ.100లతో షేర్ కొనుగోలు చేస్తే ఇప్పుడు ఐదు రెట్లకు పైగా రిటర్న్స్ అందిస్తోంది. 2020లో ఐఆర్సీటీసీ స్క్రిప్ట్ రూ.1291 పలికితే, ఇప్పుడు రూ.6,300 దాటిపోయింది. గత నెల రోజుల్లో ఐఆర్సీటీసీ స్క్రిప్ట్ డబుల్ రిటర్న్స్ అందించింది. నెల క్రితం దీని విలువ రూ.3,550 . వారం క్రితం రూ.4800 ఉంటే, కేవలం వారంలో రూ.1,500 లాభాలు తెచ్చి పెట్టింది.
నెల రోజుల్లోనే ఐఆర్సీటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రెట్టింపుకు పైగా పెరిగింది. సరిగ్గా నెలరోజుల క్రితం రూ.48 వేల కోట్లుగా ఉన్న ఐఆర్సీటీసీ ఎం-క్యాప్ రెట్టింపైంది. రైల్వే ఆస్తుల నగదీకరణకు ప్రభుత్వం రూపొందించిన ప్లాన్స్ కూడా ఐఆర్సీటీసీ షేర్ పెరగడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక ప్రారంభంలో రికార్డులు నెలకొల్పిన ఐఆర్సీటీసీ షేర్స్ అకస్మాత్తుగా రూ.1400 పడిపోయాయి. 15 శాతం నష్టంతో రూ.4,995లకు పడిపోయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో రూ.6,393లతో ఏడు శాతం లబ్ధి పొంది రూ.1.01 లక్షల కోట్లకు ఐఆర్సీటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ చేరుకున్నది. మంగళవారం ట్రేడింగ్ ముగింపు దశలో రూ.5,363 వద్ద నిలిచింది.
Volvo 2021 : భారత్‌లో వోల్వో ఎక్స్‌సీ60 హైబ్రిడ్, ఎస్90 హైబ్రిడ్ లాంఛ్!
హౌజింగ్‌లో హైదరాబాద్ జోష్.. ఇండ్ల అమ్మకాల్లో రెట్టింపు వృద్ధి
Grofors | ఈ-కామర్స్‌లో గ్రోఫోర్ విస్తరణ.. అందుకేం చేస్తుందంటే?!
LIC IPO | ఎల్ఐసీ ఐపీవోపై నిర్మలా సీతారామన్ సంకేతాలు.. ఎప్పుడంటే?!