DC vs LSG : చావోరేవో పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు శివాలెత్తారు. డేంజరస్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్(0) సున్నాకే ఔటైనా.. యువకెరటాలు అభిషేక్ పొరెల్(58), ట్రిస్టన్ స్టబ్స్(57 నాటౌట్)లు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. దాంతో, ఢిల్లీ కీలక పోరులో రెండొందలకు పైగా కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపించిన పొరెల్ రెండో వికెట్కు షాయ్ హోప్(38)తో 92 రన్స్ జోడించి ఢిల్లీకి గట్టి పునాది వేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్(33), స్టబ్స్, అక్షర్ పటేల్(14 నాటౌట్)లు ఆఖర్లో కుమ్మేశారు. దాంతో, ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 రన్స్ కొట్టింది.
టాస్ ఓడిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే పెద్ద షాక్. భీకర ఫామ్లో ఉన్న ఓపెనర్ జేక్ ఫ్రేజర్(0)కే యుధ్వీర్ ఓవర్లో వెనుదిరిగాడు. రెండు పరుగులకే తొలి వికెట్ పడినా సరే.. ఆర్సీబీపై తడబడినట్టు ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్కు చేరలేదు. ఫ్రేజర్ క్రీజులో లేని లోటును భర్తీ చేసిన పొరెల్ పవర్ ప్లేలో తన బ్యాట్ పవర్ చూపించాడు. షాయ్ హోప్(38) అండగా పొరెల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌలర్ మారినా బంతి లక్ష్యం బౌండరీయే అన్నట్టుగా చిచ్చరపిడుగు చెలరేగాడు. హోప్ సైతం దంచడంతో ఈ ఇద్దరూ రెండో వికెట్కు 92 రన్స్ జోడించారు.
అభిషేక్ పొరెల్(58)

ప్రమాదకరంగా మారుతున్న ఈ ద్వయాన్ని బిష్ణోయ్ విడదీశాడు. హోప్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్(33), ట్రిస్టన్ స్టబ్స్(57 నాటౌట్)లు చెలరేగడంతో.. 16 ఓవర్లకు స్కోర్ 150 దాటింది. 47 రన్స్ రాబట్టిన ఈ జోడీని విడదీసిన నవీన్ ఉల్ హక్ లక్నోకు బ్రేక్ ఇచ్చాడు. ఒంటిచేత్తో సిక్సర్ కొట్టబోయిన పంత్ బౌండరీ వద్ద హుడాకు తేలికైన క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్(14 నాటౌట్) చివరి ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాది ఢిల్లీ స్కోర్ 200 దాటించాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్(2/51) రెండు వికెట్లు పడగొట్టాడు.
Two stylish strokes, 1 result 💥
Tristan Stubbs reaches his fifty in style 🚀
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvLSG pic.twitter.com/4DacwQUuFP
— IndianPremierLeague (@IPL) May 14, 2024