Gold Rates | కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం (Gold), వెండి (Silver) ధరలకు కాస్త బ్రేక్ పడింది. గత మూడు రోజుల్లో బంగారం ధర రూ.3,850 మేర తగ్గింది. అటు వైట్ మెటల్ కూడా ఒక్కసారిగా పడిపోయింది. ఒక్కరోజే రూ.17 వేల మేర తగ్గింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,150కి తగ్గింది (Gold Rates). రెండు రోజుల క్రితం ఈ ధర రూ.1.43 లక్షలకు చేరిన విషయం తెలిసిందే. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,850 పలుకుతోంది. ఇక ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరలు భారీగా పడిపోయాయి. కిలో వెండి ధర ఒక్కరోజే రూ.17,200 తగ్గింది. దీంతో రూ.2.50 లక్షలు దాటిన కిలో వెండి ధర.. తాజా తగ్గింపుతో రూ.2,40,800కి పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 8 శాతం మేర పడిపోయి 72.93 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఈ ఏడాది వెండి ధర దాదాపు 138 శాతం పెరిగింది. బంగారం ధర 75 శాతం పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
Also Read..
తగ్గిన ఏటీఎంలు..పెరిగిన డిజిటల్ చెల్లింపులు
Tech Layoffs | ఐటీ లేఆఫ్స్@2025 : టీసీఎస్ టు అమెజాన్.. లక్ష మందికిపైగా ఉద్యోగులు అవుట్