తగ్గిన ఏటీఎంలు..పెరిగిన డిజిటల్ చెల్లింపులు
దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. ఒక వైపు డిజిటలైజేషన్ పెరుగుతుండటంతో ఏటీఎంల నిర్వహణ ఖర్చులు అధికం కావడంతో వీటి సంఖ్యను బ్యాంకు లు తగ్గించుకుంటున్నాయి.
- రిజర్వు బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడి
ముంబై, డిసెంబర్ 29: దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. ఒక వైపు డిజిటలైజేషన్ పెరుగుతుండటంతో ఏటీఎంల నిర్వహణ ఖర్చులు అధికం కావడంతో వీటి సంఖ్యను బ్యాంకు లు తగ్గించుకుంటున్నాయి. రిజర్వు బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో శాఖలను పెంచుకున్న బ్యాంకులు..ఏటీఎంలను మాత్రం భారీగా తగ్గించుకున్నాయి. మార్చి 31,2025 నాటికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంలు 2,51,057కి తగ్గాయి. అంతక్రితం ఏడాది 2,53,417గా ఉన్నాయి. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు విలీనం కావడంతో వీటి సంఖ్య తగ్గిపోయాయి. గ్రామీణ, సెబీ-అర్బన్, అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు అత్యధికంగా ఏటీఎంలను నిర్వహిస్తుండగా..ప్రైవేట్ బ్యాంకులు మాత్రం అర్బన్, మెట్రోపాలిటన్ సిటీల్లో మాత్రమే నెలకొల్పుతున్నాయి.
- ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంలు 79,884 నుంచి 77,117కి తగ్గాయి.
- 1,34,694గా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల ఏటీఎంల సంఖ్య 1,33,544కి చేరుకున్నాయి.
- కానీ, వైట్ లేబుల్ ఏటీఎంల సంఖ్య 34,602 నుంచి 36,216కి పెరిగాయి.
- దేశవ్యాప్తంగా 1.64 లక్షల బ్యాంకుల శాఖలు ఉన్నాయి. క్రితం ఏడాదితో పోలిస్తే 2.8 శాతం అధికం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

