Gold-Silver Price | ప్రపంచ వ్యాప్తంగా బలమైన సంకేతాల మధ్య సోమవారం రాజధాని ఢిల్లీ నగరంలో వెండి మరోసారి సరికొత్త గరిష్టాలను తాకింది. రూ.1000 పెరగడంతో కిలోకు రూ.1,08,100 పెరిగింది. మరో వైపు 99.9 శాతం ప్యూరిటీ గోల్డ్ ధర రూ.280 తగ్గి తులానికి రూ.రూ.97,780కి చేరింది. 99.5 శాతం ప్యూరిటీ పసిడి రూ.250 పతనమై.. తులానికి రూ.97,350కి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ దీన్ని ధ్రువీకరించింది. పెట్టుబడిదారుల నుంచి బలమైన డిమాండ్, బలహీనమైన డాలర్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన విద్యుత్, ఈవీ డిమాండ్ కారణంగా వెండి ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ బంగారం స్వల్పంగా పెరిగి ఔన్స్‌కు 3,312.84 డాలర్లకు చేరుకుంది. సోమవారం మిశ్రమ సంకేతాల మధ్య బంగారం స్థిరంగా ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లోని కమోడిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ తెలిపారు.
Read Also : Stock Market | స్టాక్ మార్కెట్లో నాలుగో రోజు ర్యాలీ.. 256 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..!
అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చల అంచనాలు సురక్షిత ఆస్తులకు డిమాండ్ తగ్గేందుకు పరిస్థితులు దారి తీశాయని చెప్పారు. అమెరికాలో తాజా నాన్‌ఫార్మ్ పేరోల్స్ రిపోర్ట్ బలంగా ఉన్నది. ఇది ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాన్ని సులభతరం చేస్తుందని వ్యాపారులు ఆశిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ స్పాట్ వెండి 0.9శాతం పెరిగి ఔన్స్‌కు 36.30కి చేరుకుంది. అంతర్జాతీయంగా వెండి ధరలు 13 ఏళ్ల గరిష్టానికి చేరుకున్న తర్వాత బలమైన లాభాలతో పుంజుకుంటున్నాయని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి తెలిపారు. యూరోపియన్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, వాణిజ్యంపై భారీ అంచనాలు వెండికి మద్దతునిచ్చాయని కలాంత్రి చెప్పారు. దీర్ఘకాలిక కన్సాలిడేషన్ శ్రేణిని బ్రేక్ చేస్తూ, వెండి ధర ఔన్స్‌కు 36 డాలర్ల స్థాయిని దాటగలిగింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో 24 క్యారెట్స్ గోల్డ్ రూ.97,690.. ఇక 22 క్యారెట్ల పసిడి రూ.89,550 పలుకుతున్నది. వెండి ధర కిలోకు రూ.1,08లక్షల వద్ద కొనసాగుతున్నది.