Gold Rates | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా మరోసారి జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. డాలర్ బలహీనపడడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల బంగారంపై రూ.500 పెరిగి తొలిసారిగా తులం ధర రూ.1.20లక్షలకు పెరిగి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర సైతం రూ.500 పెరిగి తులం రూ.1,19,400కి పెరిగి జీవితకాల గరిష్టానికి చేరుకుంది.
ఇక వెండి సైతం రూ.500 పెరగడంతో కిలో రూ.1,50,500 పెరిగి ఆల్‌టైమ్ హైకి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధరల పెరుగుదలను ధ్రువీకరించింది. ట్రంప్, యూఎస్ కాంగ్రెస్ నేతల మధ్య చర్చలు స్వల్పకాలిక నిధులపై ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. దాంతో యూఎస్ ప్రభుత్వం షట్‌డౌన్ అయ్యే అవకాశాలు పెరుగుతుందని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు పెరిగాయని.. అధికారిక ఉపాధి నివేదిక విడుదల ఆలస్యమవుతుందని.. ఫెడరల్ రిజర్వ్ విధాన పురోగతి కిష్టతరం చేస్తుందని కోటక్ సెక్యూరిటీస్‌లో కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కైనత్ చైన్వాలా తెలిపారు. మరో వైపు డాలర్ ఇండెక్స్ 0.10 శాతం తగ్గి 97.80 వద్ద ట్రేడవుతోంది.
ఇది బులియన్ ధరలకు మరింత మద్దతుగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు భారీగా లాభాల స్వీకరణకు దిగడంతో బులియన్ ధరలు రికార్డు స్థాయిల నుండి పడిపోయాయి. స్పాట్ బంగారం 0.55 శాతం తగ్గి ఔన్సుకు 3,813.14 డాలర్లకు చేరుకుంది. విదేశీ మార్కెట్లలో స్పాట్ వెండి 1.51 శాతం తగ్గి ఔన్సుకు 46.22 డాలర్లకు తగ్గింది. బంగారం ఔన్సుకు 3,871 డాలర్లకు చేరిందని.. ప్రస్తుతం ఔన్సుకు 3,818 వద్ద ట్రేడవుతోందని మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ అండ్ కరెన్సీ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల బంగారం రూ.1,17,440 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.1,07,650 పలుకుతుంది. వెండి కిలోకు రూ.1.61లక్షలు పలుకుతున్నది.
Railway Rules | జనరల్ రైలు టికెట్‌కు ఆధార్ తప్పనిసరి..! రేపటి నుంచి మారనున్న రైల్వే రూల్స్..!