Railway Rules | జనరల్‌ రైలు టికెట్‌కు ఆధార్‌ తప్పనిసరి..! రేపటి నుంచి మారనున్న రైల్వే రూల్స్‌..!

Railway Rules | భారతీయ రైల్వే ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నది. నిబంధనల్లో పలు మార్పులు చేసింది. జనరల్‌ రిజర్వేషన్‌ టికెట్లకు సైతం ఆధార్‌ అథంటికేషన్‌ను తప్పనిసరి చేసింది. ఈ నిబంధన అక్టోబర్‌ ఒకటి నుంచి అమలులోకి రానున్నది. మారిన నిబంధనల ప్రకారం.. జనరల్‌ రిజర్వేషన్లు టికెట్లను బుక్‌ చేసుకునే సమయంలో ఆధార్‌ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.