2 నెలల్లో రూ.5000 పెరిగిన బంగారం!
2నెలల్లో రూ.5000 పెరిగిన బంగారం! దేశీయ మార్కెట్లో రెండు నెలల్లోపే తులం బంగారం ధర రూ.5,000 పెరిగింది.ఏప్రిల్ ప్రారంభంలో ఎంసీఎక్స్‌లో రూ.44 వేలు....

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో రెండు నెలల్లోపే తులం బంగారం ధర రూ.5,000 పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో జూన్ ఫ్యూచర్స్ బంగారం ధర దాదాపు ఫ్లాట్‌గా రూ.48,778 పలికింది. ఏప్రిల్ ప్రారంభంలో ఎంసీఎక్స్‌లో రూ.44 వేలు పలికిన 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ.49వేల స్థాయికి చేరింది.
అంతర్జాతీయంగా నిశ్శబ్ద వాతావరణం దేశంలో బంగారం ధరలు పెరగడానికి కారణమైంది. ఇదిలా ఉంటే వెండి కిలో ధర జూలై ఫ్యూచర్స్‌లో రూ.77 తగ్గి రూ.71,334 పలికింది. ఇంతకుముందు ముగింపులో రూ.71,411ను తాకితే అంతకుముందు రూ.71,577 వరకు దూసుకెళ్లింది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ పసిడి ఔన్స్ ధర 1900 డాలర్లకు చేరువైంది. గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఔన్స్ బంగారం ధర 1,912 డాలర్ల స్థాయికి దూసుకెళ్లి, చివరిలో 0.07 శాతం తగ్గి 1,899.80 డాలర్లు పలికింది. ఇది జనవరి 8వ తేదీ తర్వాత అత్యధికం.
స్పాట్ వెండి ధర ఔన్స్‌పై 0.23 శాతం తగ్గి 27.812 డాలర్లుగా నిలిచింది. అమెరికా డాలర్‌తోపాటు బంగారం ధరలు తిరిగి పుంజుకుంటున్నాయని డైలీ ఎఫ్ఎక్స్ కరెన్సీ స్ట్రాటర్జిస్ట్ ఐల్యా స్పివాక్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ కరెన్సీల కంటే అమెరికా డాలర్ వారం గరిష్ఠ స్థాయికి పెరగడంతో దాని ప్రభావం బంగారంపైనా పడుతున్నది. దీనివల్ల ఇతర కరెన్సీలు కలిగి ఉన్నవారు బంగారం కొనాలంటే మరింత ప్రియమే.
ఎంసీఎక్స్ మార్కెట్లో సమీప భవిష్యత్‌లో తులం బంగారం ధర రూ.49,100 స్థాయికి చేరవచ్చునని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రూ.48,400-48,600 మధ్య బంగారానికి మద్దతు లభించవచ్చు. లేదా రూ.49,050-49,200 వద్ద నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
నోట్లు ముద్రించడమే మార్గం.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?
ప్రపంచంలో అత్యంత కుబేరుడిగా జెఫ్ బెజోస్ స్థానం పదిలం
వ్యాక్సినేషన్ తోనే ఎకానమీపై మహమ్మారి ఎఫెక్ట్ కు చెక్ : ఆర్బీఐ
వ్యాక్సిన్లపై పన్ను కోతలేనట్లే!
హనుమంతుని జన్మస్థలంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు ప్రధాని పర్యటన
ఐటీ కొత్త రూల్స్.. ఆందోళన వ్యక్తం చేసిన ట్విట్టర్ సంస్థ
మామిడి పండ్లు తినగానే ఆ ఐదింటి జోలికి అసలే పోవద్దు..!
నన్నెవరూ అరెస్ట్ చేయలేరు : రాందేవ్ బాబా
యాంటీబాడీ కాక్టెయిల్ ట్రయల్స్‌కు జైడస్ దరఖాస్తు
భారతీయ ఐటీ చట్టాలకు కట్టుబడి ఉన్నాం : గూగుల్ సీఈవో
12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్
దగ్ధమైన సింగపూర్ నౌక.. పర్యావరణానికి పెనుముప్పు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

