Gold Rates | గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది (Gold Rates). అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఫారెక్స్ మార్కెట్లో యూఎస్ డాలర్ పుంజుకుంది. డాలర్ విలువ పెరగడంతో.. రూపాయి విలువ తగ్గింది. ఫలితంగా పుత్తడి ధరలు కూడా దిగివచ్చాయి.
గత రెండు రోజుల్లో పది గ్రాముల బంగారం ధర రూ.2,100 తగ్గింది. అదే సమయంలో వెండి ధర కిలోకు రూ.4,050 తగ్గింది. గురువారం నాటికి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో డిసెంబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ 0.37 శాతం క్షీణతతో 10 గ్రాముల బంగారం ధర రూ.76,369 వద్ద ప్రారంభమైంది. వెండి డిసెంబర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్‌లు 0.24 శాతం తగ్గి రూ.90,601కి చేరింది. బుధవారం నాడు ఇంట్రాడే ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.3,158 వరకూ పతనమై 91,490 వద్ద నిలిచిన విషయం తెలిసిందే.
ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (IBJA) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 76,570గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.74,720గా, 20 క్యారెట్ల తులం బంగారం ధర రూ.68,130, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,201గా ఉంది. గుడ్‌రిటర్న్స్ డేటా ప్రకారం.. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,790 తగ్గి రూ.78,710కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,650 తగ్గి రూ.72,150 వద్ద కొనసాగుతోంది.
Also Read..
Ram Gopal Varma | బుల్లెట్ ట్రంప్‌కి తగిలితే కమల చనిపోయింది : రామ్ గోపాల్ వర్మ
Double Murder | కొడుకుతో కలిసి.. తల్లి, సోదరిని హత్య చేసిన వ్యక్తి
Chief Justice DY Chandrachud: మరణశిక్షపై ఏఐ లాయర్‌కు ప్రశ్న వేసిన సీజేఐ చంద్రచూడ్.. వీడియో