Chief Justice DY Chandrachud: మరణశిక్షపై ఏఐ లాయర్‌కు ప్రశ్న వేసిన సీజేఐ చంద్రచూడ్.. వీడియో
Chief Justice DY Chandrachud : మన దేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్దమేనా అని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాయర్‌కు ఆయన ఆ ప్రశ్న వేశారు. దానికి ఏఐ లాయర్ సమాధానం ఇచ్చారు.
న్యూఢిల్లీ: చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్(Chief Justice DY Chandrachud) ఇవాళ ఢిల్లీలో నేషనల్ జుడిషియల్ మ్యూజియంను ప్రారంభించారు. ఆ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు చెందిన లాయర్‌కు ఓ ప్రశ్న వేశారు. ఏఐ లాయర్‌ను ఆయన తన ప్రశ్నతో పరీక్షించారు. భారత్‌లో మరణశిక్ష రాజ్యాంబద్దమేనా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కృత్రిమ మేధకు చెందిన లాయర్ సమాధానం ఇచ్చారు. అడ్వకేట్ టై కట్టుకుని, కంటి అద్దాలు ధరించిన ఆ ఏఐ లాయర్ మాట్లాడుతూ.. అవును, మరణశిక్ష భారత్‌లో రాజ్యాంగబద్దమే అని పేర్కొన్నారు. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే ఆ శిక్షను ఖరారు చేస్తారని, చాలా హేయమైన నేరాలకు సుప్రీంకోర్టు ఆ శిక్ష వేస్తుందన్నారు. ఏఐ లాయర్ ఇచ్చిన సమాధానంతో సీజే చంద్రచూడ్ ఆశ్చర్యపోయారు. స్మైల్ ఇస్తూ ఆయన అక్కడ నుంచి కదిలారు. సోమవారం నుంచి కొత్త సీజేగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
#WATCH | Delhi | At the inauguration ceremony of the National Judicial Museum and Archive (NJMA) at the Supreme Court, Chief Justice of India DY Chandrachud interacts with the ‘AI lawyer’ and asks, “Is the death penalty constitutional in India?” pic.twitter.com/ghkK1YJCsV
— ANI (@ANI) November 7, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

