అమెజాన్x రిలయన్స్ టార్గెట్ ఫ్యూచర్

న్యూఢిల్లీ: దేశీయ రిటైల్ బిజినెస్ నెట్వర్క్ సంస్థ ‘ఫ్యూచర్’ను టేకోవర్ చేసుకునే విషయమై ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ మేజర్ అమెజాన్, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ పోటీ పడుతున్నాయి. రిలయన్స్‌లో విలీన ఒప్పందానికి ఆమోదం తెలుపాలని మార్కెట్ రెగ్యులేటర్ ‘సెబీ’కి మంగళవారం కిశోర్ బియానీ సారథ్యంలోని ఫ్యూచర్ గ్రూప్ లేఖ రాసింది. దీనికి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రామాణికంగా తీసుకోవాలని కోరింది.
రిలయన్స్‌లో విలీనం ఆలస్యమయ్యే కొద్దీ తమ వాటాదారులకు ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఫ్యూచర్ గ్రూప్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఫ్యూచర్ గ్రూప్‌ను విలీనం చేయడం చెల్లుబాటు అవుతుందని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 21వ తేదీన తీర్పు చెప్పింది.
ఇదిలా ఉంటే రిలయన్స్‌లో ఫ్యూచర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల విలీన ఒప్పందానికి ఆమోదం తెలిపే ముందు సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు తుది తీర్పు కోసం వేచి చూడాలని సెబీని ఇంతకుముందే ఈ-కామర్స్ మేజర్ అమెజాన్ కోరింది.
2019 ఆగస్టులో ఫ్యూచర్ గ్రూప్ అన్‌లిస్టెడ్ కంపెనీల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్‌లో (ఎఫ్‌సీఎల్) అమెజాన్ 49 శాతం వాటా కొనుగోలుచేసింది. దేశీయ మల్టీ బ్రాండ్ రిటైల్‌లో పూర్తి స్థాయి విదేశీ యాజమాన్య హక్కుపై కేంద్రం నిషేధం ఎత్తివేస్తే.. కొన్నేళ్ల తర్వాత ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ స్వాధీనం చేసుకునే హక్కుతోపాటు ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాలను అమెజాన్ పొందింది. కరోనా మహమ్మారి ప్రభావంతో నష్టాల బారిన పడిన ఫ్యూచర్ రిటైల్ సంస్థ.. రిలయన్స్‌కు తన ఆస్తులను రూ.24,713 కోట్లకు విక్రయించింది. దీంతో అమెజాన్ న్యాయ పోరాటానికి దిగింది.
ఈ పరిస్థితుల్లో రిలయన్స్‌లో ఫ్యూచర్ గ్రూప్ విలీనం ఒప్పందానికి ఆమోదం కొన్ని నెలల పాటు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఫ్యూచర్ రిటైల్ ఆస్తులు మరింత నష్టపోతాయి. భారత్ రిటైల్ మార్కెట్‌పై పట్టు కోసం అమెజాన్, రిలయన్స్ మధ్య జరుగుతున్న పోటీ మధ్యలో ఫ్యూచర్ గ్రూప్ చిక్కుకుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ వివాదంనూ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నిర్ణయం కోసం సెబీ ఎదురు చూస్తున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- టీటీవీ దినకరణ్‌తో జతకట్టిన ఓవైసీ
- మేడ్చల్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ముఖేష్ అంబానీ ఇంటి వద్ద వాహనం కేసు దర్యాప్తు ఎన్ఐఏకు బదిలీ
- ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్‌కు చేదు అనుభవం
- గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలు వెల్లడి
- మార్చి 31 వచ్చేస్తోంది.. ఐటీఆర్‌తో ఆధార్ జత చేశారా?
- ఐటీ దాడులపై తాప్సీ.. తప్పుచేస్తే శిక్షకు రెడీ
- రెండో పెళ్లి వార్తలపై మరోసారి సీరియస్ అయిన సురేఖ వాణి
- ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలపండి