Nakul Jain | పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో నకుల్ రాజీనామా చేశారు. ఆయన సొంతంగా వ్యాపార ప్రయాణం మొదలపెట్టనున్నారు. ఈ క్రమంలో పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. ఆయన స్థానంలో సీఈవోను నియమించేందుకు సరైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నామని.. త్వరలోనే కొత్త పేరును ప్రకటిస్తామని పేర్కొంది. ఈ క్రమంలోనే పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ వృద్ధిని కొనసాగించడంతో పాటు వ్యాపార లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారించినట్లు కంపెనీ తెలిపింది.
ఫిన్‌టెక్ కంపెనీ చెల్లింపు చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆమోదం కోసం నిరీక్షిస్తున్న సమయంలోనే నకుల్ సీఈవో పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 2022లో ఎఫ్‌డీఐ నిబంధనలు పాటించనందుకు పీటీఎం దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆగస్టు 2024లో పీపీఎస్ఎల్ దిగువ పెట్టుబడులకు పేటీఎం ప్రభుత్వం నుంచి ఆమోదం పొందింది. ఆ తర్వాత కంపెనీ తిరిగి పీఏ లైసెన్స్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకుంది. ఓ వైపు ఆర్బీఐ అప్రూవల్ కోసం ఎదురుచూస్తునే.. ప్రస్తుత ఆన్లైన్ వ్యాపారులకు చెల్లింపు సేవలను అందిస్తూనే ఉంటుందని పేటీఎం పేర్కొంది.
Stock Market | బ్యాంకింగ్ షేర్ల కొనుగోలుతో.. లాభాల్లోకి దూసుకెళ్లిన సూచీలు..
Budget 2025 | బీమాకు పన్ను సుస్తీ.. ఈసారి బడ్జెట్లోనైనా ఊరట లభించేనా?