Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం లాభాల్లో ట్రేడయ్యాయి. బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులను జొప్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.60వేలకోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీస్‌ను మూడు విడుతల్లో బహిరంగ మార్కెట్ క్యాపిటల్ ద్వారా కొనుగోలు చేయనున్నది. జనవరి 30న తొలి విడుతలో రూ.20వేలకోట్లు సెక్యూరిటీ కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో మరో రెండు విడుతల్లో కొనుగోలు చేయనున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో మార్కెట్ బ్యాంకింగ్ స్టాక్స్ భారీ కొనుగోళ్లతో ప్రారంభయ్యాయి. ప్రారంభంలోనే సెనెక్స్ 323.76 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్లకుపైగా లాభంతో మొదలైంది. సెన్సెక్స్ గత సెషన్‌తో పోలిస్తే 75,659.00 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది.
ఇంట్రాడేలో 75,622.88 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 76,512.96 పాయింట్లకు పెరిగింది. చివరకు 535.23 పాయింట్లు పెరిగి.. 75,901.41 వద్ద ముగిసింది. నిఫ్టీ 128.1 పాయింట్లు పెరిగి.. 22,957.25 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,116 షేర్లు లాభపడగా.. 2,429 షేర్లు పతనమ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం తగ్గగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.7 శాతం పడిపోయింది. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ నిఫ్టీలో ప్రధాన లాభాలను ఆర్జించాయి. సన్ ఫార్మా, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ నష్టపోయాయి. ఆటో, బ్యాంక్, రియాల్టీ సూచీలు ఒకటి నుంచి 2శాతం పెరిగాయి. పవర్, మెటల్, చమురు, గ్యాస్, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, ఐటీ షేర్లు 0.5శాతం నుంచి ఒకశాతం వరకు తగ్గాయి.
Credit Cards | ఐదేండ్లలో రెండింతలు.. క్రెడిట్ కార్డులకు పెరిగిన డిమాండ్: రిజర్వుబ్యాంక్
Skoda Kylaq | మార్కెట్లోకి స్కోడా కైలాక్ ఎస్యూవీ.. ధర, ఫీచర్లు ఎలాఉన్నాయంటే?