Skoda Kylaq | న్యూఢిల్లీ, జనవరి 27 : ఎస్యూవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా స్కోడా..కైలాక్ మాడల్‌ను దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ కారు ప్రారంభ ధర రూ.7.89 లక్షలుగా నిర్ణయించింది. 1.0 టీఎస్ఐ ఇంజిన్‌తో తయారైన ఈ కారు లీటర్ పెట్రోల్‌కు 19.68 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
క్లాసిక్, సిగ్నిచర్, సిగ్నిచర్+, ప్రిస్టేజ్ వంటి నాలుగు రకాల్లో లభించనున్న ఈ కారుకు 5 స్టార్ రేటింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 25 బలమైన భద్రత ఫీచర్లు ఉన్నాయని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెట్రా జనేబా తెలిపారు. కేవలం 10.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 188 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ కారుపై మూడేండ్లు లేదా లక్ష కిలోమీటర్ల వ్యారెంటీ సదుపాయాన్ని కల్పిస్తున్నది.