Credit Cards | ముంబై, జనవరి 27 : దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డుల సంఖ్య అమాంతం పెరిగింది. గడిచిన ఐదేండ్లలో కార్డుల సంఖ్య రెండింతలు పెరిగినట్లు రిజర్వుబ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. డిసెంబర్ 2019లో 5 కోట్లుగా ఉన్న క్రెడిట్ కార్డులు ప్రస్తుతం 10.80 కోట్లకు చేరుకున్నాయని, ఇదే సమయంలో డెబిట్ కార్డులు మాత్రం యథాతథంగా ఉన్నాయని పేర్కొంది. అలాగే డిజిటల్ చెల్లింపులు కూడా రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఐదేండ్ల క్రితం 80.53 కోట్లుగా ఉన్న డెబిట్ కార్డులు ప్రస్తుతం 99.08 కోట్లకు చేరుకున్నాయి.