లండన్: చైనా నిషేధాజ్ఞలు.. ఎలన్‌మస్క్ యూటర్న్ ట్వీట్లతో ఇటీవల భారీగా పతనమైన క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్ కాయిన్ తిరిగి 40 వేల డాలర్ల మార్క్‌ను దాటింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్లోని అనిశ్చితి.. మున్ముందు మరింత పతనం అవుతుందన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో బుధవారం బిట్ కాయిన్ కోలుకుంది.
బుధవారం ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ 6.5 శాతం పెరిగి 40,904 డాలర్లను తాకింది. తర్వాతీ స్థానంలో ఉన్న ఏథర్ కూడా 7.5 శాతానికి పైగా లబ్ధి పొంది 2,906 డాలర్ల పై చిలుకు రికార్డుకు చేరుకున్నది. ఇతర క్రిప్టో కరెన్సీలు లాభపడ్డాయి.
గత నెలలో దాదాపు 65 వేల డాలర్లకు చేరువై ఆల్‌టైం రికార్డు నెలకొల్పిన బిట్ కాయిన్ ఈ నెలలో 37 శాతం పతనమైంది. తాజాగా ట్రేడింగ్‌లో లాభపడినా ఇంకా 30 శాతం డౌన్లోనే కొనసాగుతున్నది. ఏది ఏమైనా ఈ ఏడాది బిట్ కాయిన్ 40 శాతం లబ్ధి పొందింది.
మైనింగ్ ద్వారా బిట్ కాయిన్ తయారీలో పర్యావరణ పరంగా ప్రభావం చూపుతుందని పేర్కొంటూ చైనా నిషేధాజ్ఞలు విధించింది. దీంతో గతవారం బిట్ కాయిన్ 30,066 డాలర్ల స్థాయికి పడిపోయింది.
పూర్తి ఒడిదొడుకుల ట్రేడింగ్ మధ్య కనిష్ట స్థాయికి బిట్ కాయిన్ విలువ పతనమైంది. జనవరి తర్వాత బిట్ కాయిన్ అతి తక్కువ కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి.
కొత్త ఐటీ నిబంధనలతో పౌరుల ప్రైవసీ ఉల్లంఘనే: వాట్సాప్
జగన్ బెయిల్ విచారణ జూన్ 1కి వాయిదా
Flipkart Shop From Home Days sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్
మొదటి డోసు కోవిషీల్డ్.. రెండోసారి కోవాగ్జిన్
జూన్ 1 నుంచి అలిపిరి నడక మార్గం మూసివేత
యాస్‌తో 3 లక్షల ఇండ్లకు నష్టం : మమతా బెనర్జీ
ఉత్తరాది ఓటర్లపై డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
చిన్న పరిశ్రమలకు త్వరలో ఉద్దీపన ప్యాకేజీ
బంగారం కొనుగోలుదారులకు ఊరట.. ఎందుకంటే?!
బంగారం బుల్ రంకె.. నెలలోనే 7% పైపైకి?!
ఆటో కంపెనీల వారంటీ, ఫ్రీ సర్వీస్ పీరియడ్ పొడిగింపు!
గల్వాన్ సరిహద్దు ఘర్షణ వేళ.. డ్రాగన్‌కు ఆ ఎగుమతులు రెట్టింపు!!
డైమండ్ ట్రేడర్ నుంచి.. ఆసియా బిలియనీర్ వరకూ..!!
200 కోట్ల డోస్‌ల ఉత్పత్తికి వాక్‌హార్డ్ రెడీ.. కానీ?!