Anant Ambani | ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్నకుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) పాద యాత్ర (padyatra) చేపట్టారు. తన 30వ పుట్టినరోజును పురస్కరించుకొని గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారక (Jamnagar to Dwarka) వరకూ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు.
శుక్రవారం తెల్లవారుజామున అనంత్ తన పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 140 కిలోమీటర్ల ఈ ప్రయాణం ప్రస్తుతం 5వ రోజుకు చేరుకుంది. ఆయన ద్వారకాకు చేరుకోవడానికి మరో 2-4 రోజులు పట్టవచ్చని అంచనా. ట్రాఫిక్‌ను నివారించడానికి, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా Z+ భద్రత, స్థానిక పోలీసు రక్షణ మధ్య ఆయన తన యాత్రను రాత్రిపూట చేపడుతున్నారు. రోజూ 10 నుంచి 12 కిలోమీటర్ల మేర నడుస్తున్నారు.
ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ.. ‘ఈ పాదయాత్ర జామ్‌నగర్‌లోని ఇంటి నుండి ద్వారకకు ప్రారంభమైంది. ఇది గత 5 రోజులుగా కొనసాగుతోంది. మరో 2 లేదా 4 రోజుల్లో ద్వారకకు చేరుకుంటా. నేను ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా ద్వారకాధీశుడిని స్మరించుకుంటా. అలా చేస్తే ఎలాంటి అవరోధాలూ లేకుండా తలపెట్టిన కార్యం విజయవంతంగా పూర్తవుతుందని నా నమ్మకం’ అని అనంత్ అంబానీ తెలిపారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ తన 30వ పుట్టినరోజును ద్వారక ఆలయంలో జరుపుకోనున్నట్లు తెలిసింది. ఆ రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
#WATCH | Devbhumi Dwarka, Gujarat: Anant Ambani, Director, Reliance Industries Limited, is on a ‘Padyatra’ from Jamnagar to Dwarkadhish Temple
He says, “The padyatra is from our house in Jamnagar to Dwarka… It has been going on for the last 5 days and we will reach in another… pic.twitter.com/aujJyKYJDN
— ANI (@ANI) April 1, 2025
Also Read..
Tariffs | భారత్ 100% సుంకాలు వసూలు చేస్తోంది.. ప్రతీకారానికి ఇదే సరైన సమయం : వైట్‌హౌస్
Rakul Preet Singh | హిందూ ఆలయాల్లో డ్రెస్ కోడ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
Myanmar Earthquake: మయన్మార్‌లో భూకంప విధ్వంసం.. ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో శాటిలైట్