Rakul Preet Singh | దేశవ్యాప్తంగా హిందూ ఆలయాల్లో కొత్త మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి. సంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఆలయ ప్రవేశం చేసేందుకు అనుమతి ఉన్నది. ఈ క్రమంలో ఆలయాల్లో సంప్రదాయ వస్త్రధారణ ఆవశ్యకతపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అందరూ సరైన వస్త్రాలు ధరించాలని సూచించింది. ల్యాక్మే ఫ్యాషన్ వీక్‌లో రకుల్ ఈ వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ ఫిగర్‌గా మనం ఏ పని చేసినా బాధ్యతాయుతంగా చేయాలనేది తన అభిప్రాయమని పేర్కొంది.
ఫ్యాషన్ విషయానికి వస్తే సందర్భాన్ని బట్టి మన డ్రెస్సింగ్ ఉండాలని అభిప్రాయపడింది. దేవాలయానికి వెళ్లే సమయంలో.. అందుకు తగినట్లుగా సాంప్రదాయ వస్త్రధారణ ఉండాలని తెలిపింది. జిమ్‌కు వెళ్లిన సందర్భంలో వర్కట్స్కు వీలుగా డెస్‌లు వేసుకోవాలని.. డిన్నర్‌కి వెళ్లిన సమయంలో ఆ సందర్భానికి అనుగుణంగా డ్రెస్ ధరించాలని సూచించింది. సందర్భానికి అనుగుణంగా వస్త్ర ధారణ ఉండాలని తెలిపింది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ అమలు అవుతున్న విషయం తెలిసింది.
ఈ ఏడాది జనవరిలో ముంబయిలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయంలోనూ డ్రెస్ కోడ్‌ని అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పురుషులు ధోతీ, పంచె ధరించాలని, మహిళలు సారీ, సల్వార్ కమీజ్ ధరించాలని భారతీయ సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించి ఆలయానికి రావాలని ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఆలయ ప్రాగణంలో పొట్టి దుస్తులు, శరీరాన్ని స్పష్టంగా చూపించే దుస్తులు ధరించి రావడాన్ని నిషేధించారు. భక్తులు సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే ఆలయానికి రావాలని ఆంక్షలు విధించింది. ఇప్పటికే తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళలోని ప్రముఖ ఆలయాల్లో డ్రెస్ కోడ్ నిబంధన అమలులో ఉంది.
ఇదిలా ఉండగా.. రకుల్ సినిమాల విషయానికి వస్తే.. చివరిసారిగా భారతీయుడు-2 మూవీలో కనిపించింది. ప్రస్తుతం తమిళ సినిమా భారతీయుడు-3, హిందీలో దే దే ప్యార్ దే మూవీలో నటిస్తున్నది. చివరిసారిగా తెలుగులో 2011లో కొండపొలం సినిమాలో నటించింది. ఆ తర్వాత నేరుగా తెలుగులో సినిమాలు చేయలేదు. కేవలం బాలీవుడ్‌తో పాటు తమిళంలోనే చిత్రాలు చేస్తూ వస్తున్నది.