Tariffs | భారత్ 100% సుంకాలు వసూలు చేస్తోంది.. ప్రతీకారానికి ఇదే సరైన సమయం : వైట్‌హౌస్
Tariffs | భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైన విషయం తెలిసిందే.
Tariffs | భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైన విషయం తెలిసిందే. టారిఫ్‌ల విషయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఏప్రిల్ 2న తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ట్రంప్ విధించబోయే ప్రతీకార సుంకాల డెడ్‌లైన్ దగ్గరపడుతుండటంతో ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ అంశంపై వైట్‌హౌస్ (White House) తాజాగా స్పందించింది.
ఈ మేరకు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు (Tariffs) విధిస్తున్నట్లు తెలిపారు. భారత్ మాత్రమే కాకుండా ఇతర దేశాలు కూడా తమ ఉత్పత్తులపై అధిక సుంకాలను విధిస్తూ.. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దీని వల్ల తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడం కష్టతరమవుతోందని అన్నారు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చిందని.. అధ్యక్షుడు చారిత్రాత్మక మార్పులు చేయబోతున్నారని వ్యాఖ్యానించారు.
‘పలు దేశాలు అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయి. అమెరికా పాల ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ 50 శాతం సుంకాలు విధిస్తోంది. అమెరికా బియ్యంపై జపాన్ 700 శాతం సుకం వసూలు చేస్తోంది. యూఎస్ బటర్, చీజ్‌పై కెనడా 300 శాతం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం టారిఫ్‌లు విధిస్తున్నాయి. వీటి వల్ల మా ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు ఎగుమతి చేయడం కష్టతరంగా మారుతోంది. ఈ కారణంగా అమెరికన్ల వ్యాపారాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సరైన సమయం. అధ్యక్షుడు చారిత్రాత్మక మార్పులు చేయబోతున్నారు’ అని కరోలిన్ లీవిట్ వెల్లడించారు.
Also Read..
Sunita Williams: హిమాలయాలు అద్భుతం: సునీతా విలియమ్స్
NASA | బోయింగ్ స్టార్‌లైనర్‌లో మళ్లీ ప్రయాణానికి సిద్ధం.. ప్రకటించిన సునీతా విలియమ్స్..!
క్షిపణులను సిద్ధం చేస్తున్నాం.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్పందన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

