న్యూఢిల్లీ, మార్చి 31: తమ షరతులకు లోబడి అణు కార్యక్రమంపై ఒప్పందం కుదుర్చుకోని పక్షంలో బాంబు దాడులను ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ దీటుగా స్పందించింది. క్షిపణులను సిద్ధం చేస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సంబంధిత స్థావరాలపై దాడి చేసే సామర్థ్యం గల క్షిపణులను ఇరాన్ సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వ యాజమాన్యంలోని టెహ్రాన్ టైమ్స్ సోమవారం ప్రకటించింది.
అలాగే తమపై జరిగే బాంబు దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని టెహ్రాన్ టైమ్స్ వెల్లడించింది. తాను చెప్పిన డిమాండ్లకు లోబడి కొత్త అణు ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకోని పక్షంలో బాంబు దాడులు ఉంటాయని ఆదివారం ట్రంప్ హెచ్చరించారు. గతంలో ఇరాన్ ఎన్నడూ చూడని రీతిలో బాంబు దాడులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.