Amazon | టెక్ ప్రపంచంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కృత్రిమ మేధ (ఏఐ) రాక, ఆర్థిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యల పేరిట టెక్ దిగ్గజాలు మెటా, ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ సహా పలు కంపెనీలు లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి. ఆయా సంస్థలు గత ఐదేళ్లలో వేల సంఖ్యలో ఉద్యోగులకు (employees) లేఆఫ్స్ ప్రకటించాయి. కొలువుల కోత ఎప్పుడు తమకు ఎసరు పెడుతుందనే గుబులుతో టెకీలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ (Amazon) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.
తాజారౌండ్లో కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు రెడీ అయ్యింది. కార్యాచరణను సమర్థవంతంగా మార్చడంతో పాటు ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అమెజాన్ కార్యకలాపాల సమర్థతను పెంచేందుకు ఉద్యోగుల తొలగింపు సహాయపడుతుందని కంపెనీ అభిప్రాయపడింది. లేఆఫ్స్‌కు గురైన ఉద్యోగులకు అవసరమైన సాయం చేస్తామని తెలిపింది. కాగా, అమెజాన్ సీఈఓగా ఆండీ జస్సీ (Andy Jassy) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా వరుసగా ఉద్యోగుల తొలగింపులను ప్రకటిస్తూనే ఉంది. సంస్థ వ్యయ తగ్గింపు చర్యల్లో భాగంగా 2022లో ఏకంగా 27,000 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే, తాజా రౌండ్లో ఎంతమందిపై ప్రభావం ఉంటుందన్నది మాత్రం తెలియరాలేదు.
Also Read..
Elon Musk | నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయిన ఎలాన్ మస్క్
Maha kumbh | తొక్కిసలాట ఘటన మరవకముందే.. కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. కాలిపోతున్న టెంట్లు
Foetus inside foetus | గర్భిణి కడుపులోని శిశువు పొట్టలో పిండం.. మహారాష్ట్రలో అరుదైన ఘటన