వడ పావ్.. భారతదేశంలో ఇష్టమైన, రుచికరమైన చిరుతిండి. చిన్నారులు చాట్లలో వడా పావ్‌ను తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొందరు వడను శెనగపిండితో చేస్తే.. ఇంకొందరు ఆలుగడ్డలతో కూడా తయారుచేస్తుంటారు. దీనికి పావ్ జోడించి నెయ్యి, చాట్ మసాలా వేసి వేయిస్తే.. దాని రుచే వేరు. అందుకే పిల్లలు ఎక్కువగా తింటారు. అయితే, మన వద్ద సాధారణ వడ పావ్ మాత్రమే దొరుకుతుంది. కానీ, ఇప్పుడు బంగారు వడ పావ్ (Gold Vada Pav) కూడా అందుబాటులోకి వచ్చింది. ఎక్కడంటే..
మొన్న బంగారం బిర్యానీని.. నిన్న బంగారం ఐస్‌క్రీమ్‌ను వడ్డించిన దుబాయ్‌లో.. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్‌లో బంగారు వడ పావ్ కూడా దొరుకుతున్నది. 22 క్యారెట్ల బంగారం పూతతో వడ పావ్‌ను కస్టమర్లకు అందిస్తూ తమ వ్యాపారాన్ని బంగారుమయంగా చేసుకుంటున్నారు. వడ పావ్‌ను అందరి మాదిరిగా సింపుల్‌గా ఇస్తే ఏం స్పెషల్ ఉంటుందని ఆలోచించిన ఓ సంస్థ.. బంగారం వడ పావ్‌ను వేడివేడిగా వడ్డిస్తున్నది. ఇదే ప్రపంచంలో తొలి 22 క్యారెట్ బంగారం పూతతో చేసిన వడ పావ్గా కూడా గుర్తింపు పొందింది.
కరామాలో ఉన్న ఓ పావో అనే రెస్టారెంట్ భారతీయ వంటకాలను అందించడానికి ప్రసిద్ధి చెందింది. వెన్న, చీజ్‌తో తయారు చేసి వేయించిన తర్వాత వాటిని తినేందుకు వీలున్న 22 క్యారెట్ గోల్డ్ రేకుతో కప్పి వడ్డిస్తున్నారు. నోరూరించే ఈ గోల్డెన్ వడ పావ్ ధర కూడా అందుబాటులోనే ఉంచారు. దీని ఖరీదు 100 అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్లు (దాదాపు రూ.2,000) గా నిర్ణయించారు. ఈ గోల్డెన్ వడ పావ్‌ను డైన్-ఇన్ ఎంపికకు మాత్రమే అందుబాటులో ఉంచారు.
#Gold_Vada_Paav This is what's wrong with the world: too many rebels without a cause. pic.twitter.com/JKeKsgOLEo
— Masarat Daud (@masarat) August 30, 2021
బలగాలను ఎందుకు ఉపసంహరించారు? : యూఎస్ ఎంపీ రాజా కృష్ణమూర్తి
టీ20 వరల్డ్ కప్ ఆడను : బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్
పనిదినాల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడారో.. రంగు పడుద్ది..!
పీఎన్బీ ఫెస్టీవ్ ఆఫర్స్.. రుణాలపై అన్ని ఛార్జీల మినహాయింపు
లడఖ్‌లో అందుబాటులోకి ప్రపంచంలో ఎత్తైన రహదారి
ఆఫ్ఘన్లో మూతపడిన థియేటర్లు.. నష్టాల్లో బాలీవుడ్ సినిమా
పోలాండ్‌పై హిట్లర్ దాడి.. సుదీర్ఘ యుద్ధానికి అంకురార్పణ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..