Highest Road : లడఖ్‌లో అందుబాటులోకి ప్రపంచంలో ఎత్తైన రహదారి
Highest Road : లడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి నిర్మాణాన్ని సైన్యం చేపట్టింది. ఈ రోడ్డు అందుబాటులోకి రావడంతో లేహ్ నుంచి చైనా సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు వరకు సులభంగా చేరుకోవచ్చు. 18,600 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ రహదారి...

లేహ్ : లడఖ్‌లో (Highest Road) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి నిర్మాణాన్ని సైన్యం చేపట్టింది. ఈ రోడ్డు అందుబాటులోకి రావడంతో లేహ్ నుంచి చైనా సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు వరకు సులభంగా చేరుకోవచ్చు. 18,600 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ రహదారి.. లేహ్ (జిగ్రాల్-టాంగ్సే) నుంచి బనానాపాస్ను దాటుతుంది. ఈ రోడ్డు కారణంగా పాంగాంగ్ సరస్సుకు వెళ్లడం 41 కి.మీ దూరం తగ్గుతుంది. ఈ రోడ్డును సైన్యం 58 ఇంజనీర్ రెజిమెంట్ నిర్మించింది. సాధారణ ప్రజల కోసం ఈ రహదారిని లడఖ్‌కు చెందిన బీజేపీ ఎంపీ జంయాంగ్ ట్సెరింగ్ నామ్‌గ్యాల్ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఖార్దుంగ్లా పాస్ 18,380 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన రహదారిగా ఉన్నది.
వ్యూహాత్మక, పర్యాటక కోణం నుంచి ఈ రహదారి చాలా ముఖ్యమైనదని ఎంపీ నామ్‌గ్యాల్ చెప్పారు. ఈ రహదారి భవిష్యత్‌లో స్థానిక నివాసితుల సామాజిక, ఆర్ధిక స్థితిగతులను పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా లడఖ్‌లోని లలోక్ ప్రాంతంలోని ప్రజలకు ఇది పర్యాటక సౌకర్యాన్ని కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి అరుదైన ఔషధ మొక్కలను సందర్శించడానికి, స్నో స్పోర్ట్స్ కార్యకలాపాలలో పాల్గొనడానికి, సంచార జంతువులు, సరస్సులు, ఇతర ఆకర్షణలను చూడటానికి పర్యాటకులకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని నామ్‌గ్యాల్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్, 14 వ కార్ప్స్ కమాండింగ్ జనరల్ ఆఫీసర్ తాషి నామ్‌గ్యాల్ యాక్జీ, స్టాన్జిన్ చోస్పెల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ వేన్ లామా కొంచోక్ సెఫెల్తోపాటు లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిలర్లు కూడా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆఫ్ఘన్లో మూతపడిన థియేటర్లు.. నష్టాల్లో బాలీవుడ్ సినిమా
పోలాండ్‌పై హిట్లర్ దాడి.. సుదీర్ఘ యుద్ధానికి అంకురార్పణ
వ్యక్తిని హెలికాప్టర్‌కు కట్టి తిప్పారు.. వీడియో వైరల్
తాలిబాన్ దేశాన్ని ప్రపంచం గుర్తించాలి.. లేదంటే మరో 9/11 ఘటన తప్పదు: పాక్ ఎన్ఎస్ఏ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

