Afghanistan Cinema : ఆఫ్ఘన్లో మూతపడిన థియేటర్లు.. నష్టాల్లో బాలీవుడ్ సినిమా
Afghanistan Cinema : తాలిబాన్ మరోసారి ఆఫ్ఘనిస్తాన్‌ను తమ గుప్పిట్లోకి తీసుకోవడంతో అక్కడి థియేటర్లు మూతపడ్డాయి. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ సినిమాల ప్రదర్శనతో కళకళలాడిన ఆఫ్ఘన్ థియేటర్లు...

కాబూల్ : తాలిబాన్ మరోసారి ఆఫ్ఘనిస్తాన్‌ను తమ గుప్పిట్లోకి తీసుకోవడంతో అక్కడి థియేటర్లు మూతపడ్డాయి. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ సినిమాల ప్రదర్శనతో కళకళలాడిన ఆఫ్ఘన్ థియేటర్లు.. (Afghanistan Cinema) తాలిబాన్ రాకతో మళ్లీ కళ కోల్పోయాయి. 90 వ దశకంలో బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనకు ఆఫ్ఘన్ పెద్ద వినియోగదారుగా ఉండేది. హిందీ సినిమాలు చూడటం అక్కడ కుటుంబ సంప్రదాయంగా ఉండేదంటే.. మన సినిమాలను వారు ఎంతగా ప్రేమించేవారో అర్థమవుతున్నది.
బాలీవుడ్ సినిమాలు చాలా వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో చిత్రీకరణ జరిగేవి. ఎందరో బాలీవుడ్ హీరోలకు ఆఫ్ఘన్లో అభిమానులు ఉన్నారు. ఎన్నో హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో భారతీయ చలన చిత్ర పరిశ్రమ కూడా పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొంటున్నది. హిందీ సినిమాల పాటలకు అక్కడి ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉన్నది. ఇలాంటి వ్యక్తులను కనెక్ట్ చేయడానికి బాలీవుడ్ ఎల్లప్పుడూ ఒక మార్గంగా ఉంటుంది. అయితే, సంగీతం, సినిమాలను తాలిబాన్ వ్యతిరేకిస్తుండటంతో బాలీవుడ్ మార్కెట్ పెద్ద మొత్తంలో నష్టపోనున్నది.
భారతీయ సినిమాలతో ఆఫ్ఘనిస్తాన్‌కు గత 46 ఏండ్లుగా అనుబంధం ఉన్నది. 1975 లో ఫిరోజ్‌ఖాన్, రేఖ, హేమమాలిని నటించిన ‘సెయింట్’ అనే సినిమాలో ఎక్కవ భాగం ఆఫ్ఘన్లో చిత్రీకరణ జరిపారు. 1992 లో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి నటించిన ‘ఖుదా గవా’ సినిమా ఎక్కువ భాగం కాబూల్‌లో షూటింగ్ జరుపుకున్నది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆఫ్ఘన్లో వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉండటంతో.. అమితాబ్ బచ్చన్ రక్షణలో ఆఫ్ఘన్ దేశంలోని సగం వైమానిక దళాన్ని అప్పటి అధ్యక్షుడు మొహమ్మద్ నజీబుల్లా ఉంచారు. అదే సమయంలో అమితాబ్ రాయల్ హానర్ కూడా పొందారు. దీంతో ఆ సినిమాను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఆఫ్ఘన్ థియేటర్లకు క్యూకట్టారు.

అలాగే, 2003 లో ఫర్దీన్ ఖాన్, సెలేనా జైట్లీ నటించిన ‘జన్షీన్’, 2006 లో జాన్ అబ్రహం, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించి ‘కాబూల్ ఎక్స్‌ప్రెస్’, 2012 లో ‘ఏజెంట్ వినోద్’, చివరగా.. 2020 లో ‘టోర్బాజ్’ సినిమాల చిత్రీకరణ ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగింది.
ఇవి కూడా చదవండి..
పోలాండ్‌పై హిట్లర్ దాడి.. సుదీర్ఘ యుద్ధానికి అంకురార్పణ
వ్యక్తిని హెలికాప్టర్‌కు కట్టి తిప్పారు.. వీడియో వైరల్
ఆయుధాలను ధ్వంసం చేసిన అమెరికా.. కారణమేంటంటే..?
తాలిబాన్ దేశాన్ని ప్రపంచం గుర్తించాలి.. లేదంటే మరో 9/11 ఘటన తప్పదు: పాక్ ఎన్ఎస్ఏ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

