PNB Offers : పీఎన్బీ ఫెస్టీవ్ ఆఫర్స్.. రుణాలపై అన్ని ఛార్జీల మినహాయింపు
PNB Offers : దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఫెస్టీవ్ ఆఫర్‌ను ప్రకటించింది. పండుగల సీజన్లో వినియోగదారులను ఆకట్టుకోవడంలో భాగంగా...

ముంబై : దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఫెస్టీవ్ ఆఫర్‌ను (PNB Offers) ప్రకటించింది. పండుగల సీజన్లో వినియోగదారులను ఆకట్టుకోవడంలో భాగంగా అన్ని రకాల రిటైల్ ఉత్పత్తులపై ఛార్జీలను మినహాయించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు చౌకగా రుణాలు, ఇతర ఉత్పత్తులను పొందే వీలున్నది. గృహ రుణం, వాహన రుణం, ప్రాపర్టీ లోన్, పర్సనల్ లోన్, పెన్షన్ లోన్, గోల్డ్ లోన్ వంటి ఉత్పత్తులపై ప్రాసెసింగ్ ఫీజులను మినహాయించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా, ఈ అన్ని ఉత్పత్తులపై సర్వీస్ ఛార్జ్, డాక్యుమెంటేషన్ ఛార్జీలను కూడా మినహాయించినట్లు వెల్లడించింది.
వ్యక్తిగత రుణం 8.95 శాతం వద్ద లభిస్తుందని బ్యాంక్ తెలిపింది. గృహ రుణంపై కూడా బ్యాంక్ టాప్ అప్ చేసింది. గృహ రుణం 6.80 శాతం నుంచి ప్రారంభమవుతుండగా.. కారు లోన్ 7.15 శాతం వడ్డీని ఆకర్షిస్తుందని బ్యాంకు పేర్కొన్నది. వీటి కోసం కస్టమర్లు బ్యాంక్ ఆన్లైన్ సేవలను ఉపయోగించుకోవవచ్చు. ఈ ఆఫర్లన్నీ డిసెంబర్ 2021 వరకు చెల్లుబాటులో ఉంటాయని, వినియోగదారులు వీటిని సద్వినియోగం చేసుకోవచ్చునని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్లు బ్యాంక్ క్రెడిట్ పోర్ట్‌ఫోలియోను పెంచుతాయని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
లడఖ్‌లో అందుబాటులోకి ప్రపంచంలో ఎత్తైన రహదారి
ఆఫ్ఘన్లో మూతపడిన థియేటర్లు.. నష్టాల్లో బాలీవుడ్ సినిమా
పోలాండ్‌పై హిట్లర్ దాడి.. సుదీర్ఘ యుద్ధానికి అంకురార్పణ
వ్యక్తిని హెలికాప్టర్‌కు కట్టి తిప్పారు.. వీడియో వైరల్
తాలిబాన్ దేశాన్ని ప్రపంచం గుర్తించాలి.. లేదంటే మరో 9/11 ఘటన తప్పదు: పాక్ ఎన్ఎస్ఏ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

