Tamim Iqbal : టీ20 వరల్డ్ కప్ ఆడను : బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్
Tamim Iqbal : త్వరలో జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో ఆడకూడదని బంగ్లాదేశ్ లెజెండరీ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ప్రకటించి అటు బీసీబీకి, ఇటు అభిమానులకు షాకిచ్చారు. ఈ టోర్నమెంట్లో ఆడకూడదని ...

ఢాకా : త్వరలో జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో ఆడకూడదని బంగ్లాదేశ్ లెజెండరీ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) ప్రకటించి అటు బీసీబీకి, ఇటు అభిమానులకు షాకిచ్చారు. ఈ టోర్నమెంట్లో ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తమీమ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) కి సమాచారం పంపించారు. గతంలో తాను ఎక్కువ టీ20 మ్యాచులు ఆడకపోవడం వల్లనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తమీమ్ వెల్లడించాడు. మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్ జట్టును ప్రకటించేందుకు బీసీబీ సిద్ధమవుతుండగా.. తమీమ్ ప్రకటనతో మరికొంత ఆలస్యం కానున్నది.
ఐసీసీ టి 20 వరల్డ్ కప్ 2021 పోటీలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్‌లో బీసీసీఐ ఆతిథ్యమిస్తున్నది. ఈ మెగా ఈవెంట్ ప్రారంభించడానికి ఒకటిన్నర నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం, సెప్టెంబర్ 10 లోపు అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాలి. కొన్ని దేశాలు తమ జట్లను కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమీమ్ ఇక్బాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘నేను టీ 20 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడలేదు. నా స్థానంలో ఎవరు వచ్చినా న్యాయం చేకూరుతుందని భావిస్తున్నాను’ అని చెప్పారు. బంగ్లాదేశ్ తరపున 78 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తమీమ్ ఇక్బాల్.. 2020 మార్చి నుంచి ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడలేదు. ఈ ఏడాది జూన్‌లో దేశీయంగా టీ20 మ్యాచ్ ఆడినప్పటికీ, మరో సమర్ధమైన ఆటగాడికి జట్టులో స్థానం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. 2007 నుంచి టీ20 క్రికెట్ ఆడుతున్న తమీమ్ ఇక్బాల్.. ఇప్పటివరకు 229 మ్యాచులు ఆడి 6,479 పరుగులు చేశాడు.
ఇవి కూడా చదవండి..
పనిదినాల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడారో.. రంగు పడుద్ది..!
పీఎన్బీ ఫెస్టీవ్ ఆఫర్స్.. రుణాలపై అన్ని ఛార్జీల మినహాయింపు
లడఖ్‌లో అందుబాటులోకి ప్రపంచంలో ఎత్తైన రహదారి
ఆఫ్ఘన్లో మూతపడిన థియేటర్లు.. నష్టాల్లో బాలీవుడ్ సినిమా
పోలాండ్‌పై హిట్లర్ దాడి.. సుదీర్ఘ యుద్ధానికి అంకురార్పణ
వ్యక్తిని హెలికాప్టర్‌కు కట్టి తిప్పారు.. వీడియో వైరల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

