8th Pay Commission | ప్రభుత్వ ఉద్యోగులకు (Govt Employees) కేంద్రం (Central government) గుడ్‌న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిసింది. 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో వేతన సంఘం అమలు కోసం చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ 8వ వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను గణనీయంగా పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు తెలిసింది.
ఏకంగా 30 నుంచి 34 శాతం వరకూ పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇది జనవరి 2026 లేదా 2027లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 8వ వేతన సంఘం సిఫార్సుల వల్ల దాదాపు 44 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ.1.8 లక్షల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది.
ప్రతి పదేళ్లకు ఒక వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన నిర్మాణాలను ఈ కమిషన్ సమీక్షించి సవరిస్తుంటుంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జనవరి 2016లో అమలులోకి తీసుకువచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్నాయి. జనవరి 2016 – డిసెంబర్ 2025 మధ్య ఏడో వేతన సంఘం 14 శాతం జీతాల పెంపును అమలు చేసిన విషయం తెలిసిందే.
Also Read..
Union Cabinet | పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
Nipah Virus | నిఫా వైరస్‌తో మరో మరణం.. కేరళలోని ఆరు జిల్లాల్లో హై అలర్ట్