Pahalgam Terror Attack | ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. మినీస్విట్జర్లాండ్గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై సమీపంలోని అడవిలో నుంచి వచ్చిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఈ పాశవిక దాడికి పాల్పడిన ముష్కరుల కోసం దర్యాప్తు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఇక ఈ ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (NIA) దర్యాప్తు చేస్తోంది.
ఈ దర్యాప్తులో తాజాగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు స్థానికులను, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పహల్గాం మారణహోమాన్ని కళ్లారా చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి (Eyewitness) దర్యాప్తులో సంచలన విషయాలను వెల్లడించినట్లు ఎన్ఐఏ వర్గాలు తాజాగా తెలిపాయి. బైసరాన్ వ్యాలీలో 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు.. దాడి అనంతరం గాల్లోకి కాల్పులు జరిపి (terrorists fired in air) సంబరాలు చేసుకున్నట్లు వెల్లడించారు. ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు. అంతేకాకుండా పలు కీలక విషయాలు కూడా దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు ఎన్ఐఏ వర్గాల ద్వారా తెలిసింది.
Also Read..
Flash Floods | పాకిస్థాన్లో ఆకస్మిక వరదలు.. 116 మంది మృతి.. వందలాది మందికి గాయాలు
Watch: ఫొటో కోసం పోజులిచ్చేందుకు ప్రయత్నించిన ఆలయ కమిటీ చైర్మన్.. తర్వాత ఏం జరిగిందంటే?
Union Cabinet | పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం