Flash Floods | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో కుండపోత వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. ఈ వరదలకు భారీగా ప్రాణ నష్టం సంభవించింది. జూన్ 26 నుంచి పాక్ అంతటా కురిసిన కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదలకు 116 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 253 మంది వరకూ గాయపడినట్లు ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (National Disaster Management Authority) వెల్లడించింది.
వర్ష సంబంధిత ఘటనల కారణంగా గత 24 గంటల్లో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, 41 మంది గాయపడినట్లు తెలిపింది. అత్యధికంగా తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో 37 మంది, సింధ్ ప్రావిన్స్‌లో 18 మంది, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో 16 మంది మృతిచెందారు. ఈ వర్షాల కారణంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. సుమారు ఐదుగురు గాయపడినట్లు ఎన్డీఎంఏ తెలిపింది.
మరోవైపు ఆయా ప్రావిన్స్‌లకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెదర్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో గురువారం వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించొచ్చని హెచ్చరించింది.
Also Read..
Nipah Virus | నిఫా వైరస్‌తో మరో మరణం.. కేరళలోని ఆరు జిల్లాల్లో హై అలర్ట్
Prada | చెప్పుల ప్రదర్శనతో వివాదం వేళ.. కొల్హాపూర్‌ని సందర్శించిన ప్రాడా ప్రతినిధుల బృందం
Bomb Threats | ఢిల్లీ పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు.. మూడు రోజుల వ్యవధిలోనే 10వ ఘటన