బుధవారం 03 జూన్ 2020
Business - May 20, 2020 , 23:44:27

వెర్నాలో సరికొత్త వెర్షన్‌

వెర్నాలో సరికొత్త వెర్షన్‌

  • -గరిష్ఠ ధర రూ.15.09 లక్షలు

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి మధ్యస్థాయి సెడాన్‌ వెర్నాలో సరికొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది హ్యుందాయ్‌ మోటర్స్‌. ఢిల్లీ షోరూంలో ఈ కారు రూ.9.3 లక్షల నుంచి రూ.15.09 లక్షల లోపు ధరను నిర్ణయించింది సంస్థ.  బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేసిన ఈ కారు 1.5 లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌లో, లీటర్‌ టర్బో ఇంజిన్‌లోనూ లభించనున్నది. వీటిలో 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన కారు రూ.9.35 లక్షల నుంచి రూ.13.85 లక్షల లోపు, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ రూ.10.65-15.09 లక్షల లోపు, టర్బో ఇంజిన్‌ రకం మోడల్‌ రూ.13.99 లక్షలకు లభించనున్నట్లు కంపెనీ వర్గాల వెల్లడించాయి. ఈ నూతన కారులో వెంటిలేటెడ్‌ సీట్‌, టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, 20.32 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్‌ చార్జింగ్‌, ఎలక్ట్రిక్‌ సన్‌ రూఫ్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి.

టీసీఎస్‌ సీఈవో వేతనంలో 16 శాతం తగ్గుదల

న్యూఢిల్లీ, మే 20: గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెనీ సర్వీసెస్‌   (టీసీఎస్‌) సీఈవో, ఎండీ రాజేశ్‌ గోపినాథన్‌ రూ.13.30 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. అంతక్రితం ఏడాది పొందిన రూ.16.02 కోట్ల రెమ్యునరేషన్‌తో పోలిస్తే 16 శాతం తగ్గింది. 2019-20కిగాను వేతనం కింద రూ.1.35 కోట్లు అందుకున్న గోపినాథన్‌.. బత్తా కింద రూ.1.29 కోట్లు, కమీషన్‌ కింద రూ.10 కోట్లు, అలవెన్స్‌ల కింద రూ.72.82 లక్షలు పొందినట్లు తన వార్షిక నివేదికలో సంస్థ వెల్లడించింది. కంపెనీకి వచ్చిన లాభాల్లో ఇచ్చే కమీషన్‌ తగ్గిపోవడం వల్లనే ఆయన వేతనంలో భారీ గండిపడింది. 


logo